- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయన్‌తో తప్ప ఇంకెవరితోనూ చేయను: గోపి
నయనతార లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆరం’. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటించారు. బోర్‌వెల్‌లో పడిపోయిన పిల్లాడిని రక్షించే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం నయనతారకు మంచి పేరు తీసుకురావడంతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు, ఇలాంటి పాత్రలకు నయన్ మాత్రమే న్యాయం చేయగలుగుతుందనే నమ్మకాన్ని కలిగించింది. యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు గోపీ నయినార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు గోపి అప్పుడే ప్రకటించారు. కానీ, ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార ఆరం-2లో నటించడానికి సిద్ధపడలేదని, ఈ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేష్ నటిస్తుందని కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై దర్శకుడు గోపి తాజాగా సమాధానమిచ్చారు.
ఆరం చిత్ర సీక్వెల్లో కీర్తి సురేష్ నటించట్లేదని దర్శకుడు స్పష్టం చేయడంతో పాటు ఇలాంటి బేస్‌లెస్ రూమర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కరోనా వైరస్ కారణంగా.. పరిస్థితులు ఎప్పుడూ నార్మల్ స్టేజ్‌లోకి వస్తాయో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రాజెక్ట్ ఎప్పుడూ ప్రారంభించే దాని గురించి ఏం మాట్లాడలేను. ఆరం-2 నయనతారతో మాత్రమే చేస్తాను. ఇంకెవరితో ఆ సినిమా చేయను, చేయబోను’ అని అన్నారు. పైగా నయనతార ఇందులో పొలిటిషయన్ పాత్రేమీ చేయట్లేదని, కానీ ఆరం చిత్రం లాగానే.. ఇందులోనూ సోషల్ ఇష్యూస్ మీదనే డిస్కస్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇది మొదటి సినిమాకు మించిన కథ అని, తప్పకుండా హిట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా గోపి ప్రస్తుతం జై హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే దీని షూటింగ్ మొదలు పెడతానని తెలిపాడు.