- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన ఆపద్బాంధవుడు
దిశ, ఆదిలాబాద్: ఆయన ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హెల్త్ సూపర్ వైజర్. తన వృత్తిని దైవంగా భావిస్తాడు. ఓ నిండు గర్భిణికి నొప్పులు రావడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించాడు. అంతేకాకుండా అత్యవసరంగా అదే గర్భిణికి రక్తం అవసరంమవ్వడంతో తానే రక్తదానం చేసిన ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఆయన ఎవ్వరో కాదు.. కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ జె.గోపాల్. మారుమూల అటవీ ప్రాంతమైన గంగాపూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి మౌనికకు శనివారం నొప్పులు రావడంతో సమాచారం తెలుసుకున్న గోపాల్.. ఆమె సురక్షితంగా నిర్మల్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానాకు తరలించాడు. ప్రసవ సమయంలో ఆమెకు రక్తం అవసరమని డాక్టర్లు చెప్పడంతో వెంటనే రక్తదానం చేసిన ఈ నిండు గర్భిణి ప్రాణాలనూ కాపాడాడు. ఒకవైపు వృత్తి ధర్మం నిర్వర్థిస్తూనే… మరో వైపు మానవతా దృక్పథంతో రక్తదానం చేసిన హెల్త్ సూపర్ వైజర్ గోపాల్‌ను అందరూ అదర్శంగా తీసుకోవాలి.