- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారతి, షర్మిల మధ్య విభేదాలు: వైఎస్ సన్నిహితుడు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి, షర్మిల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వైఎస్ సన్నిహితుడు గోనె ప్రకాశ్ ఓ న్యూస్ ఛానల్‌తో అన్నారు. దాదాపు 5నెలల నుంచి కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు అనిల్, షర్మిల తీవ్ర కసరత్తులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్, షర్మిల ఎంతో సన్నిహితంగా ఉంటారని, షర్మిలను జగన్ బాగా చూసుకుంటారని తెలిపిన గోనె ప్రకాశ్.. 2018 క్రిస్మస్ వరకే షర్మిల పులివెందులకు వెళ్లారని, 2019లో జగన్ సీఎం అయ్యాక అటువైపే వెళ్లలేదన్నారు.
కొద్దిరోజుల నుంచి షర్మిల పార్టీ పెడుతారని వార్తలు వస్తున్నా ఆమె ఖండించలేదంటేనే అర్థం చేసుకోవాలని.. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం షర్మిల తన పీఏను ఓ అడ్వకేట్ దగ్గరకు కూడా పంపిందన్నారు. 2019ఎన్నికల్లో షర్మిలకు జగన్ లోక్‌సభ సీటు ఇస్తానని ఇవ్వలేదని, అంతేగాక రాజ్యసభ సీటు విషయంలోనూ ఆశ చూపినట్లు తెలుస్తుందన్నారు. అందుకే ఇగో ప్రాబ్లమ్స్ వచ్చి.. షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే ఓ నిర్ణయానికి వచ్చారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఇంతవరకు షర్మిల తాడేపల్లి వెళ్లలేదన్నారు.