- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గెజిట్ వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం’
దిశ, ఏపీ బ్యూరో: జలవివాదాలను రెండు రాష్ట్రాలు మరింత జఠిలం చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ మైసూరారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ లబ్ధికోసం ఘర్షణపడి రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ఆరోపించారు. నదీజలాల వివాదాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు కలిసి చర్చించుకుంటే సరిపోతుందని..అయితే వారికి ఎందుకు భేషజాలు అడ్డంవస్తున్నాయో అర్థంకావడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి ఉందని తెలిపారు.
మరోవైపు కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరా ఆక్షేపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. సీమ ప్రాజెక్ట్‌ల నీటి కేటాయింపులకు చట్టబద్ధత ఇవ్వకుండా గెజిట్ ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ చొరవ చూపి గెజిట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం తలెత్తే అవకాశం లేకపోలేదని మైసూరారెడ్డి హెచ్చరించారు.