- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచే గ్యాస్ సిలిండర్ ధర పెంపు నిర్ణయం అమలులోకి వచ్చిందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. సిలిండర్ ధర పెరగడం ఇది నెల రోజుల వ్యవధిలో మూడో సారి. ఈ కాలంలో ధర రూ.120 పైకి చేరింది. తాజా ధరల పెంపు నేపథ్యంలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.694కు చేరింది. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఈ రేట్లు వర్తిస్తాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు రూ.17 ఎక్కువ చెల్లించాలి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరను సవరిస్తూ వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ రేట్లను అనుగుణంగా ఈ రేట్లు మారుతూ వస్తాయి. సిలిండర్ ధర పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు. ఇది కూడా కాకపోతే స్థిరంగా కూడా ఉండొచ్చు. కాగా డిసెంబర్ నెలలో 14.2 కేజీల సిలిండర్ ధర రెండు సార్లు పెరిగిన విషయం తెలిసిందే. రూ.100 పైకి చేరింది.