- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు రూపాయిలకే అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?
దిశ ప్రతి నిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలో కేవలం ఐదు రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లుగా రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి మీ శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. అనారోగ్యం వల్ల అయితే నేమి, ఇతర కారణాల వల్ల అయితే నేమి మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు పేద కుటుంబాలు నానా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని మంత్రి చెప్పారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పాలమూరు పట్టణంలో ఐదు రూపాయల వ్యయంతో నే అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని మహబూబ్ నగర్ పట్టణ శివారులో పరిశీలించి ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందులో గ్యాస్ ఆధారిత గ్రేవ్ యార్డ్‌ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. దీనివల్ల పేద కుటుంబాల వారికి ఎంతో మేలు జరగలేదన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, తదితరులు ఉన్నారు.