11 నుంచి ఇంటింటికీ ప్రధాని మోడీ సందేశం

by Shyam |
11 నుంచి ఇంటింటికీ ప్రధాని మోడీ సందేశం
X

దిశ, ఎల్బీనగర్ :
ఈ నెల 11 నుంచి 17 వరకు ఇంటింటికీ ప్రధాని నరేంద్ర మోడీ సందేశం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి తెలిపారు. గురువారం హయత్ నగర్ మండల కార్యాలయ ఆవరణలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సామ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి‌లు పార్టీ నాయకులతో కలిసి ప్రమాణం చేయించి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇద్దరు సభ్యుల జట్టుగా తమ బూత్‌లోని ప్రతి ఇంటికెళ్లి మోడీ సందేశాన్ని అందించాలన్నారు. కరోనా మార్గదర్శకాలైన భౌతిక దూరం, ఫేస్ కవర్ ధరించడం వంటివి తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కళ్లెం జీవన్ రెడ్డి, కడారి యాదగిరి యాదవ్, గోవింద చారి, సంఘి అశోక్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మిదాసు, వీరేశ్, జెన్నీ, గోపాల్ నాయక్, జంజ్యా నాయక్, హరి నాయక్, బలరాం నాయక్, గోవర్ధన్, సంతోష్ ముదిరాజ్, గంగని శ్రీను, గంగని రాము, ఉజ్వల్ శివాజీ గణేశ్, ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story