- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్స్‌తో మోసం
దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల కన్ఫర్మ్ కోసం ఎంపీ, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్స్‌తో మోసం చేస్తున్న ముఠాను మంగళవారం ఆర్‌పీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ అధికారులు మాట్లాడుతూ గోవా, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల 9 లెటర్ హెడ్స్ నుంచి ఒకే రకమైన అభ్యర్థనలు ఈక్యూ సెల్ కు రావడంతో రైల్వే అధికారులకు అనుమానం వచ్చి విచారించడంతో మోసం వెలుగులోకి వచ్చిందన్నారు.
హైదరాబాద్‌లోని బొల్లారంలో దిలీప్ నాయక్ పట్టుకుని విచారించడంతో ముఖేష్ చౌహాన్ అనే వ్యక్తి నుంచి లెటర్ హెడ్స్ ను సేకరించి వెయిటింగ్ టికెట్ల కన్ఫర్మ్ కోసం వాడుతున్నట్లు ఒప్పుకున్నాడన్నారు. మల్కాజిగిరిలో అనధికారికంగా రైల్వే టికెట్ల బుకింగ్ షాపును ముఖేష్ చౌహాన్ నిర్వహిస్తున్నాడని తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.1,66,476 విలువైన 84 టికెట్లను స్వాధీనం చేసుకొని రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
నిందితులను విచారించగా ఎంపీ, ఎమ్మెల్యే లెటర్ హెడ్స్ డౌన్ లోడ్ చేసుకొని నకిలీ అభ్యర్థనలతో రైల్వే వీఐపీ కోటా కింద బెర్త్‌ల కన్ఫర్మ్ కోసం ఉపయోగించినట్లు ఒప్పుకున్నారన్నారు. ముఠాను పట్టుకున్న హైదరాబాద్ క్రైం ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, మల్కాజ్ గిరి ఆర్పీఎఫ్ బృందాన్ని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు.