- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ముగ్గురి కబంధహస్తాల్లో… రాజ్యాంగ వ్యస్థలున్నాయి
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైసీపీ ప్రభత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా శ్రీనివాసులు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్షాలపై ప్రభుత్వం చేస్తున్న అసత్యప్రచారాలు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు అవినీతి చేశాడని ఆధారాలు లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగారు. పోలీస్ కస్టడీకి తీసుకోకుండా ఆయన్ని విచారించలేరా? బీసీ నాయకుడిపై అంత కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడం కాదా అని ప్రశ్నించారు.
రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుకుంటూ, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేస్తూ, పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి, వైవీ. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల కబంధహస్తాల్లో రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ వెనకుండి నడిపిస్తున్నది వారే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల ఫోన్ సంభాషణల్లోని వివరాలు వైసీపీకి చేరుతున్నాయని తెలుసుకున్నామని, అందుకే చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానికి లేఖ రాశారు. చంద్రబాబు లేఖపై వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.