- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ కాళ్లు పట్టుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటన :కొల్లు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలీట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం? దేని కోసం? అంటూ నిలదీశారు. ఏపీకి ఏం సాధించారని ఢిల్లీ వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు. తనకు 25 మంది ఎంపీలకు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక సాధిస్తానని ప్రగల్బాలు పలికిన జగన్.. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అటువంటి పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ ఢిల్లీ ప్రయాణం కేవలం పైరవీలు చేసుకునేందుకేనని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లుతున్నారా?.. లేకపోతే ఢిల్లీలో సూట్ కేసులు అందించడానికి వెళ్లుతున్నారా? అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న అరాచకాలు ఢిల్లీ వరకు వెళ్లాయన్నారు. దీంతో క్షమించమని ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లుతున్నారా? అని నిలదీశారు. ఎన్నికల్లో జగన్ పార్టీ అరాచకాలు ఎక్కువైపోయాయన్నారు. హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని జగన్ ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొందరలోనేే జగన్ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడతారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.