- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయాలకు దూరంగా ఉన్న 'మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం'
X
దిశ, వెబ్ డెస్క్: కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన వయస్సు 98 ఏళ్లు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని అతని కుమారుడు అరుణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటు ఆస్పత్రి వైద్యులు కూడా మెడికల్ బులెటిన్ ను విడుదల చేశారు. అచ్యుతానందన్ మూత్రపిండాల సమస్యలు, గ్యాస్ట్రో ఎంటెరిటీస్ తో బాధపడుతున్నారని, ప్రస్తుతం అతనికి చికిత్స అందుస్తున్నామని బులెటిన్ లో పేర్కొన్నారు.
దిగ్గజ కమ్యూనిస్ట్ నాయకుడైన అచ్యుతానందన్ 2006లో కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Advertisement
Next Story