- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ ఎమ్మెల్యే అల్లుడి దిష్టిబొమ్మ దహనం.. కాంట్రాక్టర్ ముసుగులో..!
దిశప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్ తండా వద్ద ఓం శాంతి హాట్‌మిక్స్ కంపెనీ కాంట్రాక్టర్ మాజీ ఎమ్మెల్యే గంగారాం అల్లుడు సతీష్ దిష్టిబొమ్మను దహనం అధికార పార్టీ నేతలు దహనం చేశారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే రోడ్డు నిర్మాణం కోసం నిధులు ఇచ్చినా పనులు జరగడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బురద మట్టి రోడ్డు పై దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ.. అధికార తెరాస పార్టీ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంట్రాక్టులు దక్కించుకొని పనులు చేయడం లేదని విమర్శించారు. జుక్కల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాంట్రాక్టర్ ముసుగులో ఉన్న కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు వాసరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్ శపధం రెడ్డి, మండల సర్పంచ్, ఎంపీటీసీలు కార్యాక్రమంలో పాల్గొన్నారు.