స్పెషల్ ట్రెయిన్‌లో తెలంగాణ నుంచి వలస జీవుల తరలింపు

by vinod kumar |
స్పెషల్ ట్రెయిన్‌లో తెలంగాణ నుంచి వలస జీవుల తరలింపు
X

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వలస కార్మికులను తరలించేందుకు ఒక స్పెషల్ ట్రెయిన్ బయల్దేరింది. ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో.. తెలంగాణలోని లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియా జిల్లాకు వలస కార్మికులతో స్పెషల్ ట్రెయిన్ బయల్దేరి వెళ్లింది. 24 బోగీల ఈ ప్రత్యేక రైలు.. ప్రతి కంపార్ట్‌మెంట్‌కు 72 సీట్ల సదుపాయం ఉన్నది. కానీ, సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క కోచ్‌లో 54 మందిని కూర్చోబెట్టారు. అంటే సుమారు 1,200 మంది వలస కార్మికులను జార్ఖండ్‌కు తరలించినట్టు తెలుస్తున్నది. ఈ ట్రెయిన్ లింగంపల్లి నుంచి బయలుదేరిన అనంతరం రైల్వేస్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒక స్పెషల్ ట్రెయిన్‌ను నడిపిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికైతే.. ఇది ఒక్కటే స్పెషల్ ట్రెయిన్ నడుస్తున్నది. మరికొన్ని స్పెషల్ ట్రెయిన్‌ సేవలపై ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేవని వివరించింది. వలస కార్మికులను పంపించాల్సిన, గమ్య రాష్ట్రాల విజ్ఞప్తులపై రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఇంకొన్ని ప్రత్యేక ట్రెయిన్‌లకు సంబంధించిన ప్లాన్స్ ఉంటాయని తెలిపింది. స్పెషల్ ట్రెయిన్ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులను స్వరాష్ట్రం జార్ఖండ్‌కు పంపివ్వాలని చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు.

TAGS: CORONAVIRUS, MIGRANTS, WORKERS, LABOURERS, JHARKHAND, TELANGANA, RAILWAY MINISTRY, SPECIAL TRAIN

Advertisement

Next Story

Most Viewed