భేష్.. ఆరోగ్య కేంద్రంలో మంటలు.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు..

by Sumithra |   ( Updated:2021-08-03 04:37:39.0  )
fire accident 1
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం కుమ్మరివాడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సోమవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించగా, సమీప ప్రాంత ప్రజలు స్థానిక వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు రాజు, రవి ఆరోగ్య కేంద్రం లోపల మంటలు విస్తరించడం చూసి, అగ్నిమాపక వాహనం వచ్చేలోపుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావించి, హెల్త్ సెంటర్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.

fire accident

మంటలలో చిక్కుకున్న ఫర్నిచర్ తో పాటుగా, ఏడువేల డోసుల కొవిడ్ నివారణ వాక్సిన్ ను కాపాడగలిగారు. చాకచక్యంగా మంటలు వ్యాపించకుండా చేసి వ్యాక్సిన్, ఫర్నీచర్ మంటలపాలు కాకుండా చేసిన కానిస్టేబుళ్లు రవి, రాజు ను డీఎస్పీ రాజేశ్వర్, స్థానిక ప్రజలు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed