పెళ్లైనంక కూడా అదే ధ్యాసలో ఉన్న ప్రియురాలు.. ఫిర్యాదు చేసిన సోదరుడు

by Sumithra |   ( Updated:2021-12-29 00:28:45.0  )
Died-11
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలు ఫోన్ చేసిందని వెళ్లిన ప్రియుడిని ఆమె సోదురులు, తండ్రి కలిసి హత్య చేశారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని గోగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాద్రాకు చెందిన వ్యక్తికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడికి పెళ్లి అయ్యింది. అయినా కూడా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. డిసెంబర్ 8న కూడా ఆ యువతికి పెళ్లి అయ్యింది. కానీ, గత ఆదివారం ఆ యువతి తన ప్రియుడికి ఫోన్ చేసింది. తనని కలవాలనుందని చెప్పింది. దీంతో అతను ఆ యువతిని కలిసేందుకు వెళ్లాడు. ఇది గమనించి ఆ యువతి తండ్రి, సోదరులు అతడిని హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి బావిలో పడేశారు. తన సోదరుడు కనిపించడంలేదని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలిని, తండ్రీకొడుకులను విచారించగా నేరాన్ని అంగీకరించారు. సోదరుడి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. దీంతో ప్రియురాలిని, తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story