- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్టలు తెంచుకున్న ‘అన్నదాతల’ ఆగహ్రం.. కలెక్టర్ వచ్చేదాక కదిలేది లేదని..!
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోళ్లు, లారీల అన్ లోడింగ్ సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు బైపాస్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటన జిల్లాలోని కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం వలన రైస్ మిల్లులో లారీల అన్ లోడింగ్ సమస్య ఏర్పడిందని, దీంతో లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు రాశులు, ధాన్యం బస్తాలు సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని ఆరోపిస్తూ రోడ్డెక్కారు.
ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్న జిల్లా ఎస్పీ శ్వేత రైతుల వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా జిల్లా కలెక్టర్‌కు తాము ఎన్నిసార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని రైతులు ఫైర్ అయ్యారు. వెంటనే కలెక్టర్ ఘటనా స్థలానికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. తాను కలెక్టర్‌తో మాట్లాడతానని రాకపోకలకు అంతరాయం కలిగించ రాదని ఎస్పీ పేర్కొనడంతో రైతులు ఆందోళన విరమించారు.