- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూరియా కోసం బారులు తీరిన రైతులు
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రైతులు సోమవారం యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత పదిహేను రోజులుగా యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తీరుగుతున్నా… ఒక్క బస్తాకూడా దొరకట్లేదన్నారు. ఈ విషయంపై అగ్రికల్చర్ ఆఫీసులకు వెళితే యూరియా మొత్తం దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంతానికి వెళ్తుందని అధికారులు చెప్పుతున్నట్టు రైతులు వెల్లడించారు.
రైతులకు చెందిన ఆధార్ కార్డులోని పేర్లు, అడ్రస్‌ను నమోదు చేసుకుంటూ ఒక్కొ రైతుకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పుతున్నారు. రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి సరిపడ యూరియాను కూడా అందించలేకపోతుందని రైతులు మండిపడుతున్నారు. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ వెంటనే స్పందించి వ్యవసాయానికి కావల్సిన యూరియాను అందించాలని కోరుతున్నారు.