- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విగ్రహానికి అడ్డుగా ఉన్నాయనీ ఏకంగా షాపులను తొలగించిన అభిమానులు..
దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నెలకొల్పిన ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి అడ్డుగా ఉన్న షాపులను ఆయన అభిమానులు శనివారం తొలగించారు. ఆర్టీసీ అధికారులు షెడ్‌లు నిర్మించి దుకాణదారులకు కిరాయిలకు ఇవ్వడంతో మాధవ రెడ్డి విగ్రహం కనబడడం లేదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాధవ రెడ్డి అభిమానులు విగ్రహం ఎదురుగా ఉన్న షాప్ లను తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న మాధవరెడ్డి కుమారుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విగ్రహానికి అడ్డుగా ఉన్న షాపులను తొలగించాలని సూచించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కౌన్సిలర్ బాబా షరీఫ్, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాధవ రెడ్డి అభిమానులు, తదితరులు ఉన్నారు.