- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ పేరుతో ఫేక్ న్యూస్ క్లిప్.. ఎవరూ నమ్మకండి..
దిశ ప్రతినిధి, వరంగల్ : దిశ పత్రిక పేరుతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఫేక్ క్లిప్‌లను క్రియేట్ చేసి వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో తిప్పుతూ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని దిశ పత్రిక యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్ ప్రకటించడంపై ఈటల రాజేందర్ తీవ్రంగా దూషించినట్లుగా ఓ ఫేక్ క్లిప్‌ను దిశ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు క్రియేట్ చేశారు. ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ క్లిప్ ఉంది. ఆ క్లిప్‌లో ఉన్న వార్త దిశలో ప్రచురితం కాలేదు. దిశ డైనమిక్ ఎడిషన్ పేజీల్లో ప్రచురితమైనట్లుగా… ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారు. వేర్వేరు పదాలను వార్తకు అతికించి, గందరగోళమైన వాక్య నిర్మాణంతో రెచ్చగొట్టే విధంగా వండివార్చారు. దిశ ఎప్పుడూ ఇలాంటి విద్వేషపూరిత పదాలను వాడదు. తప్పుడు వార్తలను ప్రచురించదు. ఈ ఫేక్ క్లిప్‌ను తయారు చేసిన వారిని పట్టుకోవాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దిశ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.