కన్నింగ్ ప్రేమికుడు: కోరిక తీర్చుకున్నాక.. నగ్న చిత్రాలు బయటపెట్టి..

by srinivas |   ( Updated:2021-08-08 01:49:33.0  )
కన్నింగ్ ప్రేమికుడు: కోరిక తీర్చుకున్నాక.. నగ్న చిత్రాలు బయటపెట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ప్రేమించినవాడే కదా అని ఆమె అతనితో చనువుగా మెలిగింది. పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకుంది. ఆ ప్రేమ కాస్త ముదిరి ఇద్దరు శారీరకంగా కూడా కలిశారు. ఆ తరువాత ప్రియుడు మొహం చాటేశాడు. కులం వేరు అని చెప్పి పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక జరిగిందేదో జరిగింది అని యువతి తల్లిదండ్రులు చూపిన వాడిని ఇష్టంలేకున్నా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది. ప్రియురాలిని వదిలేసినా ఆమె పరువు ఇంకా తీయాలనుకున్నాడు కిరాతక ప్రియుడు.. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ఆ యువతి ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి పాలుచేసి ఆమె మరణానికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన లీలావతి (25) తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలోని తన అక్క ఇంట్లో ఉంటోంది. అదే మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన పైల వెంకటేష్‌, లీలావతి ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహం చేసుకోమని ప్రియుడ్ని అడగగా.. అతడు కులం సాకు చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. పెద్దల బలవంతంతో వారు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యింది.

ఆగస్టు 26న పెళ్లి కూడా నిశ్చయించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు వెంకటేష్‌ కిరాతకుడిగా మారాడు. ప్రియురాలికి సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి ఆమెను అల్లరిపాలు చేశాడు. ఈ విషయం బయటపడడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరిముందు అవమాన భారం తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌ కొక్కేనికి ప్లాస్టిక్‌ వైరుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వధువుగా మారాల్సిన కుమార్తె విగతజీవిగా కనిపించేసరికి ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed