కరోనా కేసులు పెరుగుతున్నాయి: ఈటల

by Anukaran |   ( Updated:2020-06-29 02:15:18.0  )
కరోనా కేసులు పెరుగుతున్నాయి: ఈటల
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మరణాలు 3 శాతం.. తెలంగాణలో కరోనా మరణాల శాతం 1.1 శాతం మాత్రమే అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, హైదరాబాద్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. 184 మంది పోలీసులకు, ఆరోగ్యశాఖలో 257 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఆయన తెలిపారు. అవసరమైతే మళ్లీ లాక్ డౌన్ విధించుదామని సీఎం కేసీఆర్ చెప్పారని, నాలుగైదు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నామని, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం బాధితులకు చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లోని కంటోన్మెంట్ జోన్లలో జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story