- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
హోల్‌సేల్ మార్కెట్లలో తగ్గిన నిల్వలు
– లాక్ డౌన్ కొనసాగితే.. నిత్యావసర సరుకులకు తిప్పలు
దిశ, న్యూస్ బ్యూరో: నిత్యావసర సరుకులపై కరోనా వైరస్(కొవిడ్-19) పంజా విసురుతోంది. 17 రోజులుగా రాష్ట్రంలో నిత్యావసరాల దిగుమతులు నిలిచిపోవడంతో క్రమ క్రమంగా సరుకుల నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకుల రేట్లు రెండింతలు అయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం రాష్ట్రంలో చింత పండు నిల్వలు లేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం లేనందున, ఉన్న చింతపండుకు భవిష్యత్తులో డిమాండ్ ఉండే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు తెలుపుతున్నారు. అంతర్రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే సరుకులు ధరలు ఆకాశానంటే పరిస్థితి ఉంటుందని వాపోతున్నారు. రైతులు పండించిన పంటలూ మార్కెట్‌కు వచ్చే అవకాశం లేక, వచ్చినా ట్రేడర్స్ కొనుగోలు చేయకపోవడంతో క్రయ విక్రయలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక నిత్యావసర సరుకులకు తిప్పలు ఉంటాయని వర్తకవ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో నిల్వ ఉన్న నిత్యావసర సరుకులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కొక్కటిగా నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతోంది. మార్కెట్లూ మూతపడ్డాయి. మార్చి 21 నుంచి రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతయ్యే మిర్చి నిలిచిపోయింది. ఈ నెల చివరి వారంలోనైనా ఇతర రాష్ట్రాల నుంచి మిర్చి దిగుమతి చేసుకోకపోతే రాష్ట్రంలో మిర్చి కొరత ఏర్పడుతుందని అధికారులంటున్నారు. హైదరాబాద్‌లోని మలక్ పేట్ మార్కెట్‌లో నెల రోజుల నుంచి మిర్చి దిగుమతి నిలిచిపోయింది. దీంతో ఇక్కడి నుంచి హైదరాబాద్ మహానగరం మొత్తం హోల్‌సేల్ వ్యాపారులకు, రిటెయిల్ దుకాణాలకు సప్లై అగిపోయింది. దాంతో హోల్‌సేల్, రిటెయిల్ దుకాణాల్లో మిర్చి కొరత తీవ్రత పెరిగింది. ఇక చింతపండు కోసం మనం మహారాష్ట్రపై ఆధారపడ్డాం. అక్కడ కొవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్మికులు ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. దాంతో అక్కడి నుంచి వచ్చే సరుకులు పూర్తిగా నిల్చిపోయాయి. భవిష్యత్తులో చింతపండు ధరలు బాగా పెరుగనున్నాయి. ప్రస్తుతం కిలో చింతపండు రేటు రూ.95 ఉంది. ఇది రెండింతలు పెరుగుతుందని వర్తక వ్యాపారులు అంటున్నారు.
దుకాణాల్లో సరుకులు నిల్..
లాక్‌డౌన్‌తో రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడా స్తంభించింది. అయితే, ప్రభుత్వం నిత్యావసర సరకులు కొరత ఏర్పడ వద్దని సరుకు రవాణాకు వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాని కరోనా భయంతో కార్మికులు బయటికి వచ్చే పరిస్థితి లేదు. లోడింగ్ అన్ లోడింగ్‌లు చేయడానికి కార్మికులు ఎవరూ ముందుకు రావడం లేదు. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీల నుంచి పప్పులు, పిండి, చెక్కర, నూనె, బియ్యం దిగుమతి అవుతాయి. ఈ దిగుతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిత్యావసరల కొరత రోజు రోజుకూ తారా స్థాయికి చేరుతోంది.
హోల్‌సేల్ మార్కెట్లల్లో ఉన్న సరుకుల నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో దుకాణాలన్నీ ముగబోతున్నాయి. ఇక రిటెయిల్ దుకాణాల్లో అయితే సరుకులు దొరికే పరిస్థితి లేదు. ఈ రోజు ఆర్డర్ చేస్తే రెండు, లేక మూడ్రోజులకు సరుకులొస్తున్నాయి. చిరువ్యాపారుల జీవనం అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వీరికి దుకాణాలు తెరువడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరుకులు లేక దుకాణం మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారుల వద్ద సరుకులు లేకపోవడంతో రిటెయిల్ దుకాణదారులు సరుకుల కోసం రెండు, మూడ్రోజులు మార్కెట్లలో పడిగాపులు కాయాల్సివస్తోందని చిరువ్యాపారులు వాపోతున్నారు.