- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప ఎన్నికలు వాయిదా.. ఈసీ నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ విస్తరిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు కారణాల రీత్యా ఖాళీ అయిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా అదుపులోకి వచ్చేదాకా వీటి ఎన్నికను వాయిదా వేసింది.
దేశంలో దాద్రా నగర్ హవేలి, మండి (హిమాచల్ ప్రదేశ్), ఖండ్వా (మధ్యప్రదేశ్) పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే కొవిడ్ విజృంభిస్తున్నా దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపిన ఈసీ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇదే విషయమై మద్రాస్ హైకోర్టు అయితే ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ పరిస్థితులకు మీరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.
ఇదిలా ఉండగా.. మీడియా రిపోర్టులపై తాము ఎలాంటి నిషేధమూ విధించబోమని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై తమకు విశ్వాసముందని, ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర కీలకమైనదని తెలిపింది.