ఏపీ ఈఏపీసెట్ 2023 పరీక్ష ఎప్పుడంటే ..?

by Harish |
ఏపీ ఈఏపీసెట్ 2023 పరీక్ష ఎప్పుడంటే ..?
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ - 2023 పరీక్ష తేదీలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది.

ఇతర పరీక్ష తేదీలు:

మే 5, 2023 - ఈసెట్ పరీక్ష(దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023)

మే 24, 25/2023 - ఐసెట్ పరీక్ష (దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023)

Advertisement

Next Story