- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజాసింగ్ అరెస్టు వెనుక బీజేపీ వ్యూహమదేనా?
రాష్ట్రంలో మత విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రణాళిక రచిస్తున్నది. బీజేపీకి ఎన్నికలలో లబ్ది పొందాలనే ఆలోచన తప్పా తెలంగాణ సమాజం మీద, దళిత-గిరిజన బలహీనవర్గాల మీద ఎలాంటి ప్రేమ లేదు. అందుకే మోడీ, అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తాము ఏం చేస్తామనేది చెప్పకుండా కేవలం రాజకీయాలే మాట్లాడి పోయారు. దీంతో వారికి రాష్ట్ర అభివృద్ధి పైనున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రలోభాల రాజకీయాలు చేయడానికి కమిటీ వేసి, బీజేపీ బలపడాలనుకోవడం మూర్ఖత్వం. ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గుజరాత్, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి సస్పెండ్ చేసి మైనారిటీ వర్గానికి తాము అనుకూలమనే సంకేతం పంపాలనుకుంటున్నారు.
దళితుల మీద రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్ర సర్కారు మాత్రం అత్యాచార బాధితులకు సత్కారాలు చేసుకుంటూ, సంపన్నులకు కోట్ల రూపాయల పన్నుల రాయితీలు ఇచ్చుకుంటూ, దళిత, గిరిజన వర్గాల మీద కపట ప్రేమను చూపెడుతోంది. ఇటీవల మునుగోడు సభకు హాజరైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దళిత కుటుంబం ఇంటిలో కాఫీ తాగారు. దీనిని దళితుల మీద ప్రేమగా చెబుతూ ఓటు రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చాకనే దేశంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. గుజరాత్‌లో బిల్కిస్ బానో హత్య కేసులో జైలుకు వెళ్లిన 13 మంది దోషులను బయటకు తెచ్చి సన్మానం చేయడం లోని అంతర్యం ఏమిటో పసి గట్టాల్సిన అవసరం ఉంది. దళిత విద్యార్థి కుండలో నీరు తాగాడని రాజప్థాన్‌లో ఓ టీచర్ ఆ విద్యార్థిని కొట్టి చంపాడు. 75 యేండ్ల స్వతంత్ర భారతంలో దళితుల గౌరవానికి నిదర్శనం ఇది.
ఇక్కడి అభివృద్ధి ఓర్వలేక
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దళితులకు అమలు చేసిన పథకాలు చెప్పుకోదగిన స్థాయిలో లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోని అనేక మంది ప్రజలు తెలంగాణకు వలస వస్తున్నారు. వారిని ఈ నేల గుండెలకు హత్తుకొని భరోసా ఇస్తున్నది. కరోనా సమయంలోనూ వలస కార్మికులపై కేంద్రం నిర్లక్ష్యం చూపితే, రాష్ట్ర ప్రభుత్వం వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. సామాన్యుల బతుకులు మార్చడానికి దేశంలో తీసుకొచ్చిన ఏ మార్పు, ఏ పథకం కూడా భరోసా కల్పించలేకపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ నేడు రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్ల కాలంలో సబ్బండవర్గాల బతుకులను మార్చే సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. నిన్నటి దాకా మోడువారి కనిపించిన తెలంగాణ నేడు రైతులకు ఉచిత కరెంటు, చెరువుల నిర్మాణంతో పచ్చని తోరణంగా విరాజిల్లుతున్నది.కరోనా కాలంలోనూ ప్రజల కష్టనష్టాలలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ధీమా కొండంత అండగా నిలిచింది. ఇంత అభివృద్ధి చూసి ఓర్వలేని కేంద్రం అడుగడుగునా అడ్డం పడుతోంది. అందులో భాగంగానే, కేటాయించాల్సిన నిధులను ఇవ్వకుండా తెలంగాణ పట్ల తన అక్కసును వెళ్లగక్కుతున్నది. కేంద్రం ఎన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ సమాజానికి అండగా నిలుస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలో బలపడాలని
రాష్ట్రంలో మత విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రణాళిక రచిస్తున్నది. బీజేపీకి ఎన్నికలలో లబ్ది పొందాలనే ఆలోచన తప్పా తెలంగాణ సమాజం మీద, దళిత-గిరిజన బలహీనవర్గాల మీద ఎలాంటి ప్రేమ లేదు. అందుకే మోడీ, అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తాము ఏం చేస్తామనేది చెప్పకుండా కేవలం రాజకీయాలే మాట్లాడి పోయారు. దీంతో వారికి రాష్ట్ర అభివృద్ధి పైనున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రలోభాల రాజకీయాలు చేయడానికి కమిటీ వేసి, బీజేపీ బలపడాలనుకోవడం మూర్ఖత్వం.
ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గుజరాత్, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి సస్పెండ్ చేసి మైనారిటీ వర్గానికి తాము అనుకూలమనే సంకేతం పంపాలనుకుంటున్నారు. నిజంగా దళితులు, గిరిజనులు, ముస్లింల పట్ల అభిమానం ఇటువంటి వ్యాఖ్యలు చేసినపుడే చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఇది పూర్తిగా వారి కపట ప్రేమ. అధికార దాహం కోసం చేస్తున్న నాటకాలుగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.
సంపత్ గడ్డం
దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు
కామారెడ్డి, 78933 03516