- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నోబుల్ గ్రహీతలు... చెప్పిన పాఠాలు మనకేనా?
రాజకీయ విధానాలు, దేశంలో వివిధ సంస్థలను స్థాపించుకోవడం పైనే దేశ సౌభాగ్యం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పినందుకు గాను డారన్ అసెమోగ్లు , జేమ్స్ ఏ రాబిన్సన్, సైమన్ జాన్సన్‌లకు 2024 సంవత్సరానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. కొన్ని దేశాలు అద్భుతమైన ప్రగతిని ఎందుకు సాధించాయి, మరికొన్ని అట్టడుగున ఎందుకు ఉన్నాయి? కారణాలు ఏమిటి? ఆ దేశాలకు ఉన్న వనరుల్లో ఉన్న తేడానా? లేక అత్యుత్తమ ఆర్థిక విధానాలను అర్థం చేసుకొని చేపట్టడంలో నాయకుల వైఫల్యమా? కొన్ని దేశాల్లో వందేళ్లు పాతుకు పోయిన సంప్రదాయ సంస్కృతి సాహసోపేత అడుగులు వేయకుండా ప్రజల చొరవను నీరుగారుస్తోందా?
పై మూడు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఆర్థిక ప్రగతికి తోడ్పడే రాజకీయాలను సంస్థాగత ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించినందుకు 2024 నోబెల్ బహుమతిని వీళ్లు అందుకున్నారు. అయితే, ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్న సంస్థలపై ఆధారపడి ఉంటుందని ఈ నోబెల్ గ్రహీతలు తెలియజేసినారు.
రాజ్యం జోక్యం తప్పదు కానీ..
1776లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ రాసినప్పటి నుంచి 1930లలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో ప్రపం చ దేశాలు అతలాకుతలం అయ్యేంత వరకు ప్రభు త్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని ఆర్థిక శాస్త్రవేత్తలు నమ్మేవారు. సప్లై దానంతట అదే డిమాండ్‌ను సృష్టించుకుని సంపూర్ణ ఉద్యోగితతో ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతూ ఉంటుందని నమ్మేవారు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జాన్ మేనాడ్ కీన్స్ 1936లో 'ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ' అనే గ్రంథం రాసి రాజ్యం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోకుంటే సప్లై దానంతట అదే డిమాండ్‌ను సృష్టించుకోలేదు సంపూర్ణ ఉద్యోగిత కూడా సాధ్యం కాదు, ఆర్థిక అభివృద్ధి జరగదని తెలియజేసినారు. ఆనాటి నుంచి ప్రపంచ నాయ కులు అనేక సంస్థలను స్థాపించుకుంటూ తమ రాజ కీయ విధానాల ద్వారా ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధిని సాధించుకున్నారు. 2024లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు ఆర్థిక వ్యవస్థపై రాజకీయాల మంచి చెడు ప్రభావాన్ని వివరించడం జరిగింది. దేశంలోని వివిధ సంస్థల పనితీరుల వలనే దేశ పురోగతి జరుగుతుందని తెలియజేశారు.
ఆర్థిక అభివృద్ధికి వారే అవరోధం!
రాజకీయ విధానాలు సంస్థలు కల్పించే అవకాశాలు వలన ఆశ్రిత పక్షపాతాలు లేకుండా మార్కెట్లో గుత్తాధిపత్యం లేకుండా సమాజంలో సమన్యాయ పాల నతో న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఉండి విద్యావ్యాప్తి బాగా జరిగి కొత్త ఆవిష్కరణలకు వ్యక్తుల చొరవకు అడ్డంకులు లేకుండా ప్రోత్సాహకాలు సంస్థలు కల్పించగలిగితే దేశాభివృద్ధి గణనీయంగా ఉంటుంది. ఈ కోణం నుంచి చూస్తే మన దేశంలో సంస్థల పనితీరు గానీ, రాజకీయ విధానాలు కానీ అస్తవ్యస్తంగానే కనబడుతుంది. ఎన్నికల్లో వేల కోట్లు వెదజల్లే రాజకీయ సంస్కృతి అడుగడుగునా పైరవీలు అన్ని స్థాయిలో లంచాలు పాలక పార్టీలకు అధికారులు బానిసలుగా ఉండడం ప్రజా జీవితంలో నైతికత లోపించడం, మత సంస్కృతి, సంకుచిత తత్వాన్ని ప్రోత్సహించే కుల భావాలు, వీటిని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం మన దేశంలో స్పష్టంగానే అడుగడుగునా కనిపిస్తున్నది. ముఖ్యమైన వ్యవస్థలు నిష్పక్షపాక్షంగా పనిచేయించే దేశాలు అభివృద్ధి చెందవు. ఉదాహరణకు అమెరికాలోని విద్యాసంస్థలు ఆ దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. సాంకేతిక నైపుణ్యాన్ని అందించే సంస్థలు బలంగా ఉన్నందువలన జపాన్, చైనా దేశాల అభివృద్ధి ఆకాశాన్నింటింది. మన దేశంలో ఉన్న వ్యవస్థలు ముఖ్యంగా కులం, మతం అభివృద్ధికి అవరోధంగా ఉన్నాయి. దేశ జనాభాలో ఐదు శాతం లోపే ఉన్న అగ్ర వర్ణాల వారి ఆధిపత్యం దేశ ఆర్థిక అభివృద్ధికి అవరోధంగా ఉన్నది.
ఆత్మ నిర్భర్ భారత్ ఎక్కడ?
మన పాలకుల మాటల్లో ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇంతవరకు అన్ని రంగాల్లో మన దేశం సాధించిన ఫలితాలను పునాదులుగా చేసుకొని స్వయం ఆధారిత భారత్‌ని నిర్మించడమే. దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్నిస్తూ భారతదేశమంటే స్వయం ఆధారిత దేశం అని, ఇది ఐదు మూల సూత్రాలుగా పని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటన చేశారని మనందరికీ తెలుసు. మన ఆర్థిక వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయడం, అవస్థాపన సౌకర్యాలు అధికంగా కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, జనాభాను మానవ వనరులుగా మలుచుకోవడం, వారిని దేశానికి ఉపయోగపడే విధంగా చేయడం, వారి ఆదాయ ఉపాధి ఉద్యోగ కల్పన కల్పించడం, దేశం స్వయం ఆధారితంగా ఎదగడం స్థానిక ఉత్పత్తులను పెంపొందించడం వాటిని ప్రపంచవ్యాప్తం చేయడం వంటి అంశా లతో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక దన్నుగా ఈ ఆత్మ నిర్భర్ భారత్ ప్రణాళిక ఉంటుందని దేశ ప్రజలు ఆశించారు.
కార్పొరేట్‌కు అప్పగింత
అయితే దీనిని భిన్నంగా ప్రభుత్వమే ఉపాధి కార్యక్రమాలు చేపట్టకుండా దేశ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగానికి అప్పగించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. విద్య, వైద్యరంగ సంస్థలు ఎక్కువగా మన దేశంలో ప్రైవేట్ రంగం లోనే ఉన్నాయి. ఈనాడు స్వదేశీ పెట్టుబడిదారుల నుండి విదేశీ పెట్టుబడిదారుల వరకు జాతీయ వనరుల పైన, ప్రభుత్వ రంగ సంస్థల పైన ఆధిపత్యం కోసం పెట్టుబడిదారుల చేతుల్లోకి పెట్టడం ప్రభుత్వాలే నేరుగా వీరికి ఆర్థిక అభివృద్ధి అప్పగించడం శోచనీయం. రాజకీయ విధానాలు అలా ఉంటే దేశంలో అభివృద్ధిని ఆటకం పరిచే అవినీతి నియం త్రణ అంతంత మాత్రమే. డెమోక్రసీ మనదేశంలో ఫ్లూటోక్రసీగా మారిపోయింది. అవినీతితో కూడుకు న్న ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి కాదు. మన దేశంలో జరుగుతున్నది అవినీతితో కూడుకున్న ఆర్థిక వృద్ధి. అందుకే ప్రజలందరూ అభివృద్ధిలో పాలుపంచుకోలేక వృద్ధి ప్రక్రియల సమ్మితం కాలేక ఆదాయాలు తమకు దక్కకపోగా కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితిలో ఉండడానికి దేశంలో ఉన్న విధానాలు వ్యవస్థలు కారణభూతాలుగా ఉన్నాయి.
పాలించడం అంటే అమ్మేయడమేనా?
దేశంలో డెమోక్రసీని నడిపిస్తున్నది ఫ్లూటోక్రసీ అందువల్ల ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. వారికి ఉచితాలే గతి అయినాయి. ఉచితాలు అందించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో మన పాలకులు నిమగ్నం అవడం శోచనీయం. మన పాలకులు బిలియనీర్లను నమ్ముకొని దేశ సంపాదన వారికి అప్పగించి తద్వారా దేశం అభివృద్ధి జరిగిపోతున్నదని, ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయని టముకు వాయించుకుంటూ, మేము పాలించే వాళ్లమే కానీ వ్యాపారాలు చేసే వాళ్లం కాదని భావిం చడం వలన దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవస్థలే నిర్వీర్యమైనాయి. ముఖ్యంగా 1991లో నూతన ఆర్థిక విధానాలు చేపట్టినప్పటి నుంచి వివిధ ప్రభుత్వ సంస్థల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఉత్పత్తి ప్రక్రియ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయింది 1991లో ఇద్దరే ఇద్దరు బిలియనీర్లు ఉన్న మన దేశంలో నేడు 334కి చేరినారు. జీడీపీ రీత్యా మన దేశం ప్రపంచ దేశాలలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ప్రజల జీవన ప్రమాణాల రీత్యా 193 దేశాలలో 134వ దేశంగా ఉండడం దేశంలో వివిధ సంస్థల రాజకీయాల విధానాల పనితీరు తేటతెల్లమవుతున్నది. నోబెల్ గ్రహీతలు చెప్పినట్లుగానే మన దేశంలో జరుగుతున్నది.
డాక్టర్. ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
98663 22172