- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఠాధిపతికి జ్ఞానపీఠ్ పురస్కారమా?
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డు కోసం ప్రముఖ కవి గుల్జార్, పీఠాధిపతి రామభద్రాచార్య ఎంపిక అయినట్లు కమిటీ ప్రకటించింది. ఇంతవరకు సామాజిక, సాహితీ విలువలను కాపాడే ప్రముఖ రచయితలుగా పేరు, గుర్తింపు పొందిన వారికి ఇచ్చిన జ్ఞానపీఠ్ అవార్డు ఒక ఆధ్యాత్మికవేత్తకు ఇవ్వడం ఇదే తొలిసారి. సాహిత్యమంటే ఉన్నవాటిపై టీకా తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు చేయడం కాదు. సృజనశీలతకు తోడుగా సాహిత్య ప్రతిభను ప్రదర్శించేదే ఉత్తమ రచనగా పరిగణిస్తారు. ఈ లెక్కన రామభద్రాచార్య రచనలను జ్ఞానపీఠ్‌కు అర్హమైన సాహిత్యంగా చూడలేము. ఇంతవరకు ఉత్తమ రచయితల పేర్లు మాత్రమే ఈ అవార్డును పొందేవారు. మత గ్రంథాలు రాసే పీఠాధిపతులు కూడా ఈ అవార్డుకు యోగ్యులే అనేలా ఈ ఎంపిక ఉంది.
జడ్జి మతంతో పనేంటి స్వామీ?
జగద్గురుగా భక్తుల సేవలందుకొనే రామభద్రాచార్య రాసినవన్నీ ఆధ్యాత్మిక గ్రంథాలే. బాల్యంలోనే అంధుడైన రామభద్రాచార్య ఎన్నో భాషలు నేర్చి భారతీయ పురాణాలపై విస్తృత జ్ఞానాన్ని సాధించారు. సంస్కృత పండితుడిగా ఆయన హిందూమత భక్తులకు అవసరమైన రీతిలో పురాణ పురుషులపై తమ వ్యాఖ్యానాలను పుస్తకాలుగా తెచ్చారు. మరోవైపు వ్యక్తిగా జగద్గురు రామభద్రాచార్య తన బోధనలలో భాగంగా కొందరిపై తీవ్రమైన నిందలు, ఆరోపణలు చేసినట్లు వార్తలున్నాయి. తన కథా పఠనం, ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో కాంగ్రెస్ నేతలను తగ్గించి మాట్లాడడం, వారి పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడం వార్తల్లో, వీడియోల్లో చూడవచ్చు. మన్ మోహన్ సింగ్ పొడిగింపు ప్రధానమంత్రి అని, సోనియా గాంధీ విదేశీ మహిళ అని, రాహుల్ గాంధీ పుట్టుకతోనే పప్పు అని ఎద్దేవా చేసేలా నవ్వుతూ అంటుంటారు. చెరకుగడ నుంచి చక్కెర వస్తుందని కూడా తెలియని వీళ్లు రాముడు అయోధ్యలో పుట్టలేదని కోర్టులకు విన్నవించారని అన్నారు. బాబ్రీ మసీదు కేసు విచారణలో సుప్రీంకోర్టులో ఈయన సాక్షిగా చెప్పిన వివరణలు తీర్పునకు దోహదపడ్డాయని చెబుతుంటారు. అయితే 'ముస్లిం' జడ్జి అడిగిన ప్రశ్నకు వేదాలను పేర్కొంటూ జవాబునిచ్చానని ఆయన న్యాయమూర్తి మతాన్ని ప్రస్తావించడం అంగీకార యోగ్యం కాదు. ఒక పండితుడికి మతపర, రాజకీయ వ్యంగ్యత శోభనీయదు. ఈ జగద్గురు హిందువులందరి ఆధ్యాత్మిక ప్రతినిధిగా కాకుండా పూర్తిగా బీజేపీకి ప్రచారకర్తగా పని చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
సన్యాసికి రాజకీయాలెందుకు?
2023 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను సనాతన వ్యతిరేకిగా పేర్కొంటూ, సనాతన సంస్థలను నాశనం చేయాలని ప్రయత్నిస్తే వారే నాశనం అవుతారని, ప్రజలకు విజ్ఞానాన్ని అందించడమే తన పని అని చెబుతూనే కాంగ్రెస్‌పై విమర్శను ఆపలేదు. రామభద్రాచార్యను జగద్గురుగా, గొప్ప సన్యాసిగా కాంగ్రెస్ ఒప్పుకుంటూనే ప్రజలు రామకథను ఆస్వాదించేటప్పుడు బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అందులో చేర్చవద్దని కోరింది. బీజేపీ ఎన్నికల ప్రచారానికి సాధువులను వినియోగించడంపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు కూడా చేసింది. అదే సందర్భంలో ఒక భక్తజన సభలో ఆయన 'మరే ములాయం, కాన్షీరాం.. ప్రేమ్ సే బోలో జై శ్రీరాం' అని అన్నారు. దళితులను చేరదీయని హిందూ ధర్మానికి అర్థమే లేదన్న ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను ఈ గురువు మూర్ఖుడు అంటూ సంబోధించారు.
సాధువు నోట కుల దూషణ
వీటికి తోడుగా ఈ మధ్య రామభద్రాచార్య వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన శ్రీరాముడిని పూజించడం గురించి మాట్లాడుతున్నప్పుడు కులాన్ని సూచించే పదాలను ఉపయోగించడం అందులో ఉంది. ఈ వీడియో సంస్కార్ టీవీలో ప్రసారమైంది. అందులో ఆయన 'రాముణ్ణి పూజించని వాడు చెప్పులు కుట్టేవాడితో సమానమని' అన్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. 'ఇవి సాధువు అనవలసిన మాటలా? మరి రాముణ్ణి పూజించేవారిని బ్రాహ్మణులుగా అంగీకరిస్తారా!' అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆయన పదజాలం దళితుల పట్ల ద్వేషం, అంటరానితనం నూరిపోసేలా ఉన్నాయని, వేదికపై కూర్చొని బహిరంగంగా ఒక కులాన్ని అవమానిస్తున్న ఆయనకు రాజ్యాంగ సూత్రాలు వర్తించవా? అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
గురువుల పని కించపర్చడమా!
తులసీదాసు రచించిన రామచరితమానస్ లోని కొన్ని పద్యాలను ఇతను మార్చి రాశాడనే విమర్శ కూడా ఉంది. ఇన్ని వివాదాలు సృష్టించినా రామభద్రాచార్యకు మోడీ ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇక్కడ సమస్య ఒక పీఠాధిపతి తన విశ్వాసాలను ప్రచారం చేయడం కాదు. ఎంత పండితుడైనా మనుషులను కులమతపరంగా విడదీసి మాట్లాడడం ఆక్షేపణీయం. రాజకీయంగా వ్యతిరేకులను కించపరచడం, సమాజంలోని కొన్ని వర్గాలను తగ్గించి మాట్లాడడం గురువుల పని కాదు. ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తికి జ్ఞానపీఠ్ పురస్కారం ఈయడమంటే దాని విలువను తగ్గించడమే.
- బి.నర్సన్
94401 28169
- Tags
- Jnanpeeth award