- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల్లో మొబైల్ యాప్‌ల వినియోగం
రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అనేక సాంకేతికలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓటింగ్ శాతం పెరుగుదల, పారదర్శక ఎన్నికలు, ఓటర్లకు సులువైన మార్గాలతో ఈసీ అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. అలాగే అరచేతిలో ప్రపంచాన్ని చూపే సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది ఎన్నికల సంఘం. సాంకేతిక మొబైల్ యాప్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మకంగా వినియోగంలోకి తెచ్చింది. ఓటర్ ఫ్రెండ్లీగా ఉంటూనే దివ్యాంగులు మొదలు, మహిళలు, సాఫ్టవేర్ నిపుణులను ఓటింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఫలప్రదం చేసేలా యోచిస్తోంది. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేయాలంటే అక్షరాస్యులకు కూడా అనేక సమస్యలెదురయ్యేవి. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఉల్లంఘనలకు అడ్డులేకుండా పోయే పరిస్థితులు తెలిసిందే. ఇప్పుడు వీటికి సీ- విజిల్ యాప్‌తో ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
క్షణాల్లో ఫిర్యాదులు..
కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో మొబైల్ యాప్‌ల వినియోగం అధికారికంగా పెరిగింది. పారదర్శక, ప్రశాంత ఎన్నికలను సజావుగా నిర్వహించే లక్ష్యంతో ఓటర్లు, సిబ్బంది, దివ్యాంగులు, ఈసీ తన సేవలను యాప్‌ల ద్వారా అందిస్తోంది. వీటన్నింటినీ ప్లే స్టోర్ లేదా యాప్స్, లేదా ఈసీఐ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు సమాధాన్ యాప్ ఉపయోగపడుతుంది. ఫోటోలు, వీడియోలు ఆధారంగా పంపొచ్చు. తర్వాత అధికారులు తీసుకున్న చర్యల కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. సువిధ యాప్ ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలకు అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు ఈ యాప్ ద్వారా అనుమతులు కోరవచ్చు. వాహనాలు, లౌడ్ స్పీకర్లు, పార్టీ కార్యాలయాలు, హెలీకాఫ్టర్ల వినియోగం, తదితర అంశాలకు సరైన పత్రాలిచ్చి ఆన్‌లైన్‌లో ఏకీకృత అనుమతులు పొందొచ్చు. తనకొచ్చిన 24 గంటల్లోగా ఈసీ పరిష్కారం చూపుతుంది. ఎలక్టోరల్ సెర్చ్ ద్వారా ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. తమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాన్ని, మ్యాప్‌ను, రూట్‌ను తెలుసుకునే వెసులుబాటుంది. ఎన్నికల నిర్వహణలో వినియోగించే ప్రైవేటు వాహన వ్యవహారాలు పర్యవేక్షణకు సుగమ్ యాప్ కీలకంగా పనిచేస్తోంది. వాహన యజమానులు, డ్రైవర్లు, వారికి చెల్లింపుల వివరాలు ఇందులో ప్రత్యక్షమవుతాయి.
వెంటనే స్పందించే బృందాలు..
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మై జిహెచ్ఎంసి యాప్‌ను డెవలప్ చేసింది. ఓటరుకు తన పోలింగ్ కేంద్రం తెలపడంతో పాటు, మొబైల్‌లో రూట్ చూపిస్తుంది. ఈసీఐ. సిటిజన్ సర్వీసెస్. ఈసీఐ.ఇన్ సమస్య తీవ్రతను బట్టీ రిటర్నింగ్ అధికారి స్థాయి అధికారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ వరకు ఎవరికైనా ఫిర్యాదులు ఇందులో నేరుగా చేయొచ్చు. నామినేషన్లు మొదలైన తర్వాత ఈ యాప్ మరింత వేగంగా పనిచేస్తుంది. వచ్చిన పిర్యాదులపై జిల్లా రిటర్నింగ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు. దీంతో అత్యద్భుత ఫలితాలొస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్ వినియోగించాలి. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే యాప్‌లోకి వెళ్లి ఫోటో లేదా వీడియో తీసి అప్‌లోడ్ చేయాలి. అప్పుడే తీసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసేందుకు వీలుంది. పాతవాటికి అవకాశం లేకపోవడం గమనించవచ్చు. ఫోటో, వీడియో ఏదైనా తీసిన ఐదు నిమిషాల్లోపే అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అవకాశం ఉండదు. ఫిర్యాదు చేసిన వెంటనే ఫిర్యాదులు జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్‌కు చేరుతాయి. అక్కడ నిత్యం వీటిని పర్యవేక్షించే బృందం అప్రమత్తంగా ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే 15 నిమిషాల్లోగా సంఘటనా స్థలానికి ఎన్నికల బృందాలు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగా ఉల్లంఘనులపై చర్యలుంటాయి. స్పందన యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 15 నిమిషాల్లో బృందం ఫీల్డ్‌కు వెళ్లి విచారణ చేస్తుంది. 30 నిమిషాల్లో నిబంధనల ఉల్లంఘనలపై రిటర్నింగ్ అధికారికి నివేదిక. 100 నిమిషాల్లో ఘటనపై తీసుకున్న చర్యలతో కూడిన వివరాలతో ఫిర్యాదుదారుడికి సమాచారం చేరుతుంది.
వ్యవస్థల్లో జవాబుదారీతనం కోసం..
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను ఉపయోగిస్తూ అధికారుల కోసం ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సి- విజిల్ యాప్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఎస్ఎంఎస్ అంటే ఎలక్షన్స్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా తనిఖీలలో దొరికే నగదు, మద్యం,డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఐటి శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి వినియోగిస్తారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేటువంటి అధికారులందరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని,ఎప్పటికప్పుడు వివరాలను ఈ యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయలేకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ- ఎస్ఎంఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.
ఆయా పార్టీల అభ్యర్థులు పంచె డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా సి- విజిల్ యాప్ ద్వారా అనగా ఎంఫసైజస్ ద ప్రో యాక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ రోల్ సిటిజన్స్ అనే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్ స్పీకర్లు వాడిన మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన, ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఎవరైనా తమ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అక్రమాలను పొందుపరచాలి. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షలకు పైగా పౌరులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా అందినటువంటి ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలో సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అందుకే దీన్ని ఐదు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా రాబోయే రోజుల్లో సత్ఫలితాలు అందుతాయని ఆశిద్దాం. ఆ దిశగా అందరం పనిచేయాలి.
-మోటె చిరంజీవి,
సామాజిక వేత్త, విశ్లేషకులు.
99491 94327