హరిత గ్రంథాలయాలు అంటే ఏంటి?

by Ravi |   ( Updated:2022-11-24 19:00:55.0  )
హరిత గ్రంథాలయాలు అంటే ఏంటి?
X

ప్రకృతి సిద్ధ ఆరోగ్యకర పరిసరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. గ్రంథాలయంలో పేపర్ వాడకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలి. పరిసరాలలో దుమ్ము, ధూళీ, చెదలు బొద్దింకలు వంటివి రాకుండా శాస్త్రీయ పద్ధతిలో నివారించాలి. నేల పైన ఎక్కడా నీరు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పుస్తకాలు, వార్తా పత్రికలు, జర్నల్స్, మ్యాగజైన్స్ వంటివాటికి ఈ-బుక్స్ వినియోగించుకోవాలి. ఇలాంటి చర్యల వలన గ్రంథాలయాలలో సమస్యలు లేకుండా చూడవచ్చు. ఇలా ఆరోగ్యకర, పర్యావరణ హిత పరిశుభ్రతతో, తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో అనవసర వ్యర్థాలను నివారించి పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం యూజీసీ ప్రత్యేక నిధులనూ విడుదల చేస్తుంది. గ్రంథాలయాలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి.

ప్రపంచ విద్యారంగంలో అమెరికా, చైనా, తర్వాత మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో వేల సంఖ్యలో విశ్వ విద్యాలయాలు, విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, మేనేజ్‌మెంట్, పరిశోధనా సంస్థలతో పాటు సెంట్రల్ వర్సీటీలు, వేల సంఖ్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లు, లక్షల సంఖ్యలో కళాశాలలు ఉన్నాయి. వీటి నియమ నిబంధనల రూపకల్పనను, నిధుల విడుదలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (university grants commission) చూసుకుంటుంది. దీని నిబంధనల ప్రకారం ప్రతీ విద్యా సంస్థలో గ్రంథాలయం(library) ఉండాల్సిందే.

మరేం జరుగుతోంది?

ప్రతి విద్యా సంస్థకు గ్రంథాలయం గుండెకాయ వంటిది. అదొక జ్ఞాన భాండాగారం. విద్యా సంస్థలలో ప్రతి ఒక్కరు అదనపు సమాచారం కోసం కచ్చితంగా గ్రంథాలయాన్ని సందర్శించాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యత గల గ్రంథాలయాలను అనాదిగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యా సంస్థలలో ఇతర శాఖలు అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గ్రంథాలయాలు మాత్రం అలాగే ఉండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పఠనాలయాల వైశాల్యం తక్కువగా ఉండటం, ఫర్నిచర్ కొరత, సిబ్బంది కొరత, నిధుల లేమి ఇందులో ముఖ్యమైనవి. ఫలితంగా వివిధ శాఖలకు సరిపోయే నూతన పుస్తకాలు, జర్నల్స్, మ్యాగజైన్స్ మొదలైనవి సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

వర్సిటీలలో ఉన్న పురాతన గ్రంథాలయాలనూ, నూతనంగా నిర్మించబోయే అకడమిక్ గ్రంథాలయాలనూ పర్యావరణ రహితంగా, హరిత గ్రంథాలయాలు(Green Libraries) గా తీర్చిదిద్దాలని ఇటీవల జాతీయ, అంతర్జాతీయ గ్రంథాలయ సంస్థలుగా ఉన్న అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్(American Library Association), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(Indian Green Building Council) వంటివి సూచించాయి. అందులో భాగంగా సస్టయినబుల్ లైబ్రరీ, గ్రీన్ లైబ్రరీ కాన్సెప్ట్(green library concept) వంటి సంస్కరణలను సూచించాయి.

Also read: తెలంగాణ తొలి గ్రంథాలయం గురించి తెలుసా

ఏం చేయాలి?

పాత భవనాలలో వ్యర్థాలను తొలగించి, రూఫ్‌కు, గోడలకు తేమ చేరకుండా రిపేర్లు చేపట్టాలి, భవనంలోకి గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా చూసుకోవాలి, కొత్త భవనాలను పర్యావరణ హితంగా నిర్మించాలి. అధిక ఉక్కపోత నివారణకు భవనంపై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి. వెలుపలి గోడలకు పాకేలా మొక్కలను నాటాలి. ఎక్కువ పూల కుండీలను ఉంచాలి. గ్రంథాలయం పరిసరాలలో నీడ నిచ్చే చెట్లు, పూల మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఆవరణలను ఉద్యానవనంలా మార్చుకుంటే మంచిది. లైబ్రరీలో బుక్స్‌పై వెలుతురు పడేలా సీఎఫ్ఎల్ బల్బులు వాడాలి, లైబ్రరీ విద్యుత్ కొరకు సోలార్ ప్యానల్ అమర్చాలి, గ్రంథాలయంలో ఇనుప ఫర్నిచర్‌కు బదులు పర్యావరణ హిత బీరువాలు, ర్యాకులు ఫైబర్‌తో చేసినవి ఉపయోగించాలి.

ప్రకృతి సిద్ధ ఆరోగ్యకర పరిసరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. గ్రంథాలయంలో పేపర్ వాడకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలి. పరిసరాలలో దుమ్ము, ధూళీ, చెదలు బొద్దింకలు వంటివి రాకుండా శాస్త్రీయ పద్ధతిలో నివారించాలి. నేల పైన ఎక్కడా నీరు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పుస్తకాలు, వార్తా పత్రికలు, జర్నల్స్, మ్యాగజైన్స్ వంటివాటికి ఈ-బుక్స్ వినియోగించుకోవాలి. ఇలాంటి చర్యల వలన గ్రంథాలయాలలో సమస్యలు లేకుండా చూడవచ్చు. ఇలా ఆరోగ్యకర, పర్యావరణ హిత పరిశుభ్రతతో, తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో అనవసర వ్యర్థాలను నివారించి పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం యూజీసీ ప్రత్యేక నిధులనూ విడుదల చేస్తుంది. గ్రంథాలయాలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి.

Also read: పాఠకులను చేరిన ఫౌండేషన్

డా. రాధికారాణి

హెచ్‌ఓడీ-లైబ్రరీ సైన్స్

కేయూ, వరంగల్

99495 95810

Advertisement

Next Story