- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ తొలి గ్రంథాలయం గురించి తెలుసా
ఇది తెలంగాణలోనే మొదటి గ్రంథాలయం. దీని స్థాపనతోనే ప్రారంభమైన ఆంధ్రోద్యమం తెలంగాణ ప్రజలలో చైతన్యం కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపార కృషి జరిపింది. నాటి వ్యవస్థాపక సమావేశానికి పాల్వంచ, భద్రాచలం సంస్థానాధిపతి రాజా పార్థసారథి అప్పారావు అధ్యక్షత వహించారు. గ్రంథాలయం తొలి అధ్యక్షుడుగా రాజానాయని వెంకటరంగారావు బహదూర్, కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు ఎన్నికయ్యారు. ఆనాటి సభలో పాల్గొన్న పెద్దలలో మునగాల రాజా నాయని వెంకటరంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎంజీ నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకటరావు నాయుడు పేర్కొనదగినవారు.
నిజాం రాజ్యంలో తొలి తెలుగు గ్రంథాలయం స్థాపన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో చాలా మందికి తెలియదు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం హైదరాబాదులోని ప్రాచీన గ్రంథాలయం. హైదరాబాద్ రాంకోఠిలోని రావిచెట్టు రంగారావు బంగళాలో దీనిని స్థాపించారు. రంగారావు సహ ధర్మచారిణి లక్ష్మీనరసమ్మ సేవలు అందించేవారు. ఆమెనే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి మూడు వేల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ డబ్బుతోనే సుల్తాన్‌బజార్‌లో ఒక పెంకుటిల్లు కొని అందులో 1 సెప్టెంబర్ 1910న (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ, ఆదివారం) గ్రంథాలయం నెలకొల్పారు.
తెలుగంటే వల్లమాలిన అభిమానం గల రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావుతో కలసి విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని స్థాపించారు. 'శ్రీ శంకర భగవత్ పూజ్యపాద గీర్వాణరత్న మంజూష' అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి భాషా నాలయంలోనే కలిపేశారు. అందులో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు ఇత్యాది సంస్కృత ప్రబంధాలను సేకరించి పాఠకులకు అందుబాటులతో ఉంచారు. ఈ గ్రంథాలయం తాలూకు రెండువేల రూపాయలపై వచ్చే వడ్డీతో యేటా కొత్తగా వచ్చే సంస్కృత గ్రంథాలు కొనుగోలు చేసేవారు.
తెలంగాణలోనే మొదటిది
ఇది తెలంగాణలోనే మొదటి గ్రంథాలయం. దీని స్థాపనతోనే ప్రారంభమైన ఆంధ్రోద్యమం తెలంగాణ ప్రజలలో చైతన్యం కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపార కృషి జరిపింది. నాటి వ్యవస్థాపక సమావేశానికి పాల్వంచ, భద్రాచలం సంస్థానాధిపతి రాజా పార్థసారథి అప్పారావు అధ్యక్షత వహించారు. గ్రంథాలయం తొలి అధ్యక్షుడుగా రాజానాయని వెంకటరంగారావు బహదూర్, కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు ఎన్నికయ్యారు. ఆనాటి సభలో పాల్గొన్న పెద్దలలో మునగాల రాజా నాయని వెంకటరంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎంజీ నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకటరావు నాయుడు పేర్కొనదగినవారు.
రంగారావు 1910లోనే స్వర్గస్థులు కాగా, ఆయన స్థానంలో కర్పూరం పార్థసారథి నాయుడు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన మాడపాటి హనుమంతరావు పంతులు 1915లో కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. నాయని వెంకటరంగారావు, కర్పూరం పార్థసారథి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్‌జీ మేఘ్‌జీల ఆర్థిక సహాయంతో నూతన భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి 30 సెప్టెంబర్ 1921న ప్రారంభోత్సవం చేశారు.
నాటి నుంచి నేటి వరకు
భాషా నిలయం జంట నగరాలకే కాక, తెలుగువారందరికీ కూడలిగా మారింది. ఉత్సవాలు, ప్రసంగాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశం కలిగింది. శ్రీ కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవంతో ప్రారంభించి నన్నయ, తిక్కన, పోతన, వేమన మొదలైన మహాకవుల జయంతులను జరుపుతుండేవారు. ప్రాచీన కవులే కాక కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి ఆధునిక భాషా సేవకుల జయంతులు, వర్ధంతులు కూడా జరుపసాగారు. భాషా నిలయం రజతోత్సవాలు 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో కావ్యకంఠ గణపతి శాస్త్రి అధ్యక్షతన జరిగాయి. అప్పటి కార్యదర్శి బూర్గుల రామకృష్ణారావు ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచికను ప్రచురించారు.
స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబరు 1 నుంచి మూడు రోజులపాటు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన వైభవంగా జరిగాయి. అప్పటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. వజ్రోత్సవాలు 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగాయి. మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించి వజ్రోత్సవ సంచికను ప్రచురించారు. అమృతోత్సవాలు 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. శతాబ్ది ఉత్సవాలు 2002 సెప్టెంబర్ 16న జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
పేరు మార్చుకుని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక ఈ గ్రంథాలయం 2016 జూన్ 29 నుంచి తెలుగు భాషా నిలయంగా పేరు మార్చుకుని సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నది. 2015 అక్టోబర్ 29 నుంచి సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లు కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గౌరవ అధ్యక్షులుగా, స్వాతంత్ర సమరయోధులు నూతి శంకర్‌రావు కార్యనిర్వాహక అధ్యక్షులుగా, నేటికీ, సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తున్నారు. 2016 లో రావిచెట్టు రంగారావు దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. మూల నిధిని సమకూర్చుకుని, వడ్డీ డబ్బులతో తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడిన మహనీయుల స్మృత్యర్థం మాసానికి ఒక సారి జయంతి వేడుకలు నిర్వహించి, వారి పేర్ల మీద తొమ్మిది అవార్డులు, నగదు అందిస్తున్నారు.
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494