- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో వ్యవసాయ విప్లవం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణ పల్లెలు, నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. దాదాపుగా 60 లక్షల మందికి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. వ్యవసాయానికి ఉచిత కరెంటు, బృహత్తర ప్రాజెక్ట్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ జలకళతో వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా రెండో స్థానంలో ఉన్న తెలంగాణ పయనిస్తోంది. అందుకు తాజా లెక్కలే ఉదాహరణ. 2013-14 లో తెలంగాణ రాష్ట్రంలో 1.92 కోట్ల టన్నుల పంటలు పండగా.. 2022 వచ్చేసరికి అది 3 కోట్ల టన్నుల పంటలకు చేరింది.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (united nations food and agriculture organization) ఆందోళన వ్యక్తం చేసింది. సాగు, పంటల మార్పిడి, కోతలు, నిల్వల మీద యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాబోదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో గత వానాకాలంలో వేసిన వరి సాగు కంటే దేశవ్యాప్తంగా ఈసారి కోటి ఎకరాలలో వరి సాగు తగ్గిపోయింది. వివిధ కారణాలతో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో 75 సంవత్సరాల అమృత మహోత్సవంలోనూ ఆకలిచావులు, యేటా పది లక్షల మంది ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడానికి, అంతర్జాతీయంగా 30 శాతం తృణధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలే కీలకమని భావిస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం పేద, మధ్య తరగతి వర్ధమాన దేశాలు, 89 శాతం మధ్య, ధనిక దేశాలు ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. పిడికెడు మెతుకులకు ఎదురు చూసే కాలం అతి సమీపంలో ఉన్నది. తిండికి తిప్పలు పడే కాలం దాపురిస్తుంది. 12-15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని, 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రతా లేకపోవడం ప్రభుత్వ హ్రస్వదృష్టి కి నిదర్శనం.
రికార్డులు బద్దలు కొడుతూ
దేశంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానానికి దూసుకెళ్తున్న తెలంగాణపై కేంద్రం కక్ష గట్టింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, రా రైస్ మాత్రమే కావాలని కొర్రీలు పెట్టింది. చిన్న చిన్న కారణాలతో నెలన్నరకు పైగా బియ్యం సేకరణను నిలిపేసింది. మునుపెన్నడూ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా వానాకాలం సీజన్‌లో పంటల సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఖరీఫ్‌లో 135,76 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేసి కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రం వచ్చిన 2014-15 వానాకాలం సీజన్‌లో కోటి మూడు లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యేది. ఇప్పుడు దాని కంటే 32 లక్షల ఎకరాలు అదనంగా సాగు జరిగింది. తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఈ రికార్డును బద్దలుకొట్టింది.
దేశంలో 70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు దండిగా కురిసి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో పంట సేకరణ రాష్ట్ర యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఎఫ్‌సీఐ వంటి సంస్థలను కేంద్రం తన గుప్పిట పెట్టుకుని ఆహార భద్రతను గాలికి వదిలి, పంట కొనుగోళ్లను ఒక వ్యాపారంలా చూస్తున్నది. ర్యాకుల మూవ్‌మెంట్ ఇవ్వకుండా, గోదాములు కేటాయించకుండా తెలంగాణలో కొనుగోళ్లను అడ్డుకుంటున్నది. సుమారు నెలన్నరగా తెలంగాణను సతాయించిన సర్కారు ఎట్టకేలకు తన తప్పును తెలుసుకొన్నది. రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణకు అంగీకరించింది. అయినా, ముందుచూపు లేమితో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
Also read: రైతుబంధు అమలు చేసి ఇతర పథకాలెన్ని నిర్వీర్యం చేశారో తెలుసా?
సేకరణే అసలు సవాల్
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణ పల్లెలు, నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. దాదాపుగా 60 లక్షల మందికి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. వ్యవసాయానికి ఉచిత కరెంటు, బృహత్తర ప్రాజెక్ట్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ జలకళతో వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా రెండో స్థానంలో ఉన్న తెలంగాణ పయనిస్తోంది. అందుకు తాజా లెక్కలే ఉదాహరణ. 2013-14 లో తెలంగాణ రాష్ట్రంలో 1.92 కోట్ల టన్నుల పంటలు పండగా.. 2022 వచ్చేసరికి అది 3 కోట్ల టన్నుల పంటలకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం సాగుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా పండిన ప్రతి గింజను సీఎం కేసీఆర్ సారథ్యంలో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6,713 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.
సాధారణ రకం క్వింటాల్‌కు రూ. 2,040, ఎ-గ్రేడు రకానికి రూ.2,060 మద్దతు ధర నిర్ణయించింది. 2014కు ముందు రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో 25 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు లక్ష్యంగా ఉండేది. ఈ వానకాలంలో కోటి టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడం రాష్ట్రానికి గర్వకారణం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం దేశంలో అనేక రంగాలను ప్రైవేటీకరణ చేసినట్లే.. ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా అదే దృష్టితో చూస్తున్నదని వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పలుకకుండా ప్రతిఏటా మిల్లర్లు దోచుక తింటున్నారని, పంటలు కొనుగోలు చేసే సమయంలో మిల్లర్లంతా సిండికేట్ గా ఒక్కటవుతున్నారనే విమర్శ ఉంది.
Also read: రైతుబంధు లో మార్పులు తేవాలి
డా. సంగని మల్లేశ్వర్,
జర్నలిజం విభాగాధిపతి
కేయూ, వరంగల్
98662 55355