- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha : నియంతృత్వ రేవంత్ సర్కార్.. ఎక్స్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన వాంకిడి (Tribal victim of Wankidi school) గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. గత 20 రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న తుది శ్వాస విడిచింది. విద్యార్థిని చనిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న (BRS MLAs) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమని వెల్లడించారు. (Constitution Day) రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూర్పు పొడుస్తోందని విమర్శించారు. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి సర్కారు నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేశారు.