- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో ఐదుగురు ఆంధ్రా కుర్రాళ్లకు చోటు.. మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ వేదికగా 2025 సంవత్సరానికి సంబంధించిన ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) అట్టహాసంగా ముగిసింది. ఈ మెగా వేలంలో దేశంలోని యువ ప్లేయర్లకు భారీ డిమాండ్ పెరగడంతో కోట్లు కుమ్మరించి వారిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు కుర్రాలకు ఈ సంవత్సరం ఐపీఎల్(IPL) చోటు దక్కింది. వీరిలో వైజాగ్ కి చెందిన నితీష్ కుమార్ రెడ్డి గత మూడు సీజన్లుగా ఐపీఎల్ లో రాణిస్తుండగా.. అతను భారత జట్టుకు కూడా ఎంపికైన విషయం తెలిసిందే. నితీష్ తో పాటు ఈ మెగా వేలంలో షేక్ రషీద్, పైలా అవినాష్, త్రిపూర్ణ విజయ్, సత్యనారాయణ రాజులకు చోటు దక్కింది.
దీంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన యువ ప్లేయర్లకు ఐపీఎల్ లో చోటు దక్కడంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో "IPL జట్లకు ఎంపికైన నితీష్ రెడ్డి, షేక్ రషీద్, పైలా అవినాష్, త్రిపూర్ణ విజయ్, సత్యనారాయణ రాజులకు హృదయపూర్వక అభినందనలు! వారి విజయానికి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వారు మనందరికీ గర్వకారణంగా ప్రపంచ క్రికెట్ వేదికపై ప్రకాశవంతంగా మెరుస్తారని ఆశిస్తున్నాను. ఆట పట్ల వారి కృషి, అంకితభావం, అభిరుచి వారిని గొప్పగా నిలపాలి!" అని మంత్రి నారా లోకేష్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.