IPL Mega Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫిక్సింగ్ కలకలం..! సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-11-26 13:09:18.0  )
IPL Mega Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫిక్సింగ్ కలకలం..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు ఐపీఎల్ మెగా వేలం-2024 (IPL Mega Auction-2024) ముగిసింది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తాము టార్గెట్ చేసిన ప్లేయర్లను కొనుగోలు చేసి నయా జోష్‌తో ఐపీఎల్-18 సీజన్‌కు సన్నద్ధం అవుతున్నాయి. పోటాపోటీగా కొనసాగిన ఈ వేలంపాటలో రిషభ్ పంత్‌ (Rishabh Pant)ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) కొనుగోలు చేసింది. అదేవిధంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Ayyar)ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) సొంతం చేసుకుంది. ఇక ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ (Venkatesh Ayyar)ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) భారీ ధరకు దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే మెగా వేలం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇగ్లాండ్ స్టార్ ప్లేయర్ విల్ జాక్స్ (Will Jacks) కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పోటీ పడ్డాయి. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్‌ (Will Jacks)ను ముంబై ఇండియన్స్ రూ.5.20 కోట్లకు దక్కించుకుంది. అయితే, గత సీజన్‌లో ఆర్సీబీ (RCB)కి ఆడిన అతడిని తిరిగి ఆర్‌టీఎం ఆప్షన్ ఎంచుకునేందుకు ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబికి అవకాశం కల్పించింది. దీంతో ఆర్సీబీ యాజమాన్యం తిరిగి అతడిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో విల్ జాక్స్ (Will Jacks) ముంబైకు అమ్ముడుపోయాడు.

ఈ క్రమంలోనే ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ (Aakash Ambani)కి ఆర్సీబీ ఓనర్ ప్రథమేశ్ (Prathamesh) ‘ఓకే డన్’ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. అనంతరం హ్యాపీగా ఫీల్ అయిన ఆకాశ్.. ఆర్సీబీ (RCB) టెబుల్ వద్దకు వెళ్లి ప్రథమేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీలు వేలంలో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రెండు జట్లపై బీసీసీఐ (BCCI) చర్యలు తీసుకోవాలని ఆయా జట్ల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed