Brahmamudi : దిండు, దుప్పటి ఇచ్చి భర్తను బయటకు గెంటేసిన ధాన్యలక్ష్మి

by Prasanna |
Brahmamudi : దిండు, దుప్పటి ఇచ్చి భర్తను బయటకు గెంటేసిన ధాన్యలక్ష్మి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి (Brahmamudi )ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

రుద్రాణీ కావాలనే.. ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ‘ఈ కావ్య ఎలా అయిన ఇంటికి రావాలని చూస్తుంది. దాని ప్రయత్నాలు రోజు రోజుకు ముమ్మరం అవుతున్నాయి. ముందే ఈలోపే మీకు రావాల్సిన ఆస్తిని మీరు రాపించుకోండి " అంటూ సలహాలు ఇస్తుంది. అంతటితో ఆగకుండా ధాన్యం దగ్గరకు ఇంకోసారి వెళ్లి.. అన్నీ మాటలు ఎక్కిస్తుంది. ‘చూశావా.. నువ్వు ఇంతలా పోరాటం చేస్తుంటే నీ వైపు కూడా ఎవరు చూడటం లేదు. కానీ, నీ తోటికోడలు కావ్యను ఇంటికి తిరిగి తీసుకురావడానికి ఇంట్లోంచి వెళ్లిపోయి కొత్త ప్లాన్ మొదలుపెట్టింది. అంటే ఈ ఇంట్లో నీకు నువ్వే .. నీకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు.. ఒంటరి దానివి అయిపోయావు.. ముందు నీకంటూ ఒక సపోర్ట్ తెచ్చుకో ’ అని సలహా ఇస్తుంది.

ఈ మాటలన్నీ బుర్రకి ఎక్కించుకుని రాత్రికి. ధాన్యం , భర్తతో గొడవ దిగుతుంది. ‘మీరు నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి. మనకు రావాల్సిన ఆస్తి ని మనం రాపించుకోవాలి.. అది మనం కళ్యాణ్‌ని ఇవ్వచ్చు ’ అని ప్రకాశాన్ని అడుగుతుంది. దానికి ప్రకాశం వద్దు అని చెప్పడంతో .. దిండు, దుప్పటి ఇచ్చి గదిలోంచి బయటికి గెంటేస్తుంది. ‘మీరు నాకు అండగా నిలబడే వరకూ నా గదిలోకి రావడానికి వీల్లేదు’ అని భర్తను వెళ్లిపోమని చెబుతుంది. నువ్వు గెంటేస్తే ఇంతపెద్ద కొంపలో నాకు ఎక్కడా రూమే లేదనుకున్నావా.. నాకు నచ్చిన చోట నేను ఉంటాను .. అక్కడే పడుకుంటాను’ అని ప్రకాశం వెళ్లిపోతాడు.

Advertisement

Next Story