బాలల నైపుణ్యాన్ని వెలికి తీసేది బాలోత్సవం

by Naveena |
బాలల నైపుణ్యాన్ని వెలికి తీసేది బాలోత్సవం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బాల బాలికలలోని నైపుణ్యాన్ని వెలికితీసే మంచి కార్యక్రమం బాలోత్సవం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బృందావనం గార్డెన్స్ లో నిర్వహించిన పిల్లలమర్రి బాలోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నిత్యం చదువులతో నిమగ్నమై,తల్లితండ్రుల ఒత్తిడితో,ఆటపాటలకు దూరమైన బాలబాలికలకు ఈ చక్కటి కార్యక్రమం‌తో విజ్ఞానం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలుపుతూ..ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సంపూర్ణ సహకారం ఉంటుందని,వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని శిల్పారామం లో నిర్వహించుకోవచ్చని ఆయన అన్నారు. ముందుగా స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలబాలికలు వివిధ వేషాధరణ,ఆటపాలు,సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,పిల్లలమర్రి బాలోత్సవం అధ్యక్షుడు బెక్కెం జనార్దన్,డాక్టర్ ప్రీతి,డాక్టర్ మహేష్,వీరాంజనేయులు,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,కౌన్సిలర్ ప్రశాంత్,బుద్ధారం సుధాకర్ రెడ్డి,వివిధ పాఠశాలల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed