- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్-4 అభ్యర్థులకు న్యాయం చేయండి!
ప్రభుత్వం కేవలం 56 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాల ను వెల్లడించి దాదాపు పదివేల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ టైంలో ఉద్యోగ నియామకాలను చేపట్టలేదు.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పలువురి నుంచి ప్రశంసలు అందాయి.. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, అభ్యర్థులు తమ సంతోషాలను వ్యక్తం చేశా రు.. దీనిని అన్ని ఫలితాల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి.. అలాగైతేనే అందరికీ మేలు జరుగుతుంది. దాదాపు 8,000 మంది గ్రూప్ -4 అభ్యర్థు లు ఫైనల్ ఫలితాలపై ఆశగా ఎదురుచూస్తున్నా రు.. ఫైనల్ రిజల్ట్ ప్రకటించడంలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన పూర్తిచేసి అభ్యర్థుల ఇబ్బందులను తీర్చాలి..
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు..
గ్రూప్ -4 పరీక్ష కోసం 2022 డిసెంబర్ నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, 2023 జూలై నెలలో పరీక్ష రాసారు. రెండు దసరా పండగలు పోయినప్పటికీ ప్రభుత్వం ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించలేదు. కానీ డీఎస్సీ 1:3 నిష్పత్తిలో 33 వేల మంది అభ్యర్థుల వెరిఫికేషన్‌ను విద్యాశాఖ కేవలం వారం రోజుల్లో పూర్తిచేసింది. గ్రూప్ -4కు సంబంధించి 25 వేల మంది అభ్యర్థులను 1: 3 నిష్పత్తిలో వెరిఫికేషన్ చేయడానికి టిజీపిఎస్సీ 90 రోజులు తీసుకుంది. ఈ తీరుపై నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
క్రెడిట్ కోసమేనా..?
ఇంత తక్కువ టైంలో ఉద్యోగ నియామకాలను ఏ ప్రభుత్వం చేపట్టలేదు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పలువురు నుంచి ప్రశంసలు అందాయి.. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు అభ్యర్థులు తమ సంతోషాలను వ్యక్తం చేశారు.. దీనిని అన్ని ఫలితాల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి.. అలాగైతేనే అందరికీ మేలు జరుగుతుంది. కేవలం మంచి పేరు కోసం మాత్రమే డీఎస్సీ ఫలితాలను ప్రకటించి, మిగిలిన నోటిఫికేషన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఫైనల్ రిజల్ట్ ప్రకటించడంలో ఏదైనా లోపాలు ఉంటే త్వరిగతన పూర్తిచేసి అభ్యర్థుల ఇబ్బందులను తీర్చాలి. ఒక దశలో జాబ్ వస్తుందా? రావడం లేదా అనే సందేహం వారిలో రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.
ఆందోళన చేసినప్పటికీ..
గ్రూప్- 4 ఫైనల్ రిజల్ట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.. గాంధీభవన్ వద్ద మంత్రులను కలిసి తమ సమస్యలను విన్నవించారు..అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని 8వేల మంది అభ్యర్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి, వారికి, వారిపై ఆధారపడ్డ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనిల్ కుమార్ యాదవ్
సీనియర్ జర్నలిస్ట్
91774 54529