గుడ్ జాబ్ శ్రీరాం.. ఉపరాష్ట్రపతి ప్రశంస

by Sridhar Babu |   ( Updated:2020-07-14 10:05:20.0  )
గుడ్ జాబ్ శ్రీరాం.. ఉపరాష్ట్రపతి ప్రశంస
X

దిశ, కరీంనగర్: కరోనా మృతుల పలువురు స్పందిస్తున్న తీరు అందరినీ, ఆగ్రహానికి గురిచేస్తోంది. కొన్ని చోట్ల రోడ్లపై అనాథ శవంలా పడేయడం, మరి కొన్ని కుటుంబ సభ్యులు కూడా హీనంగా చూడటం మనం చూస్తున్నాం. శ్రీకాకులం జిల్లా పలాసలో ఏకంగా జేసీబీతో అంత్రక్రియలు నిర్వహించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో కోవిడ్ బాధిత మృదేహాన్ని తరలించేందుకు ట్రాక్టర్‌ను నడిపిన డాక్టర్ పెండ్యాల శ్రీరాంను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్ మాధ్యమంగా శ్రీరాం సేవలు స్పూర్తిదాయకమన్నారు.

Advertisement

Next Story