మంత్రుల ఏడాది వేతనం విరాళం

by Shamantha N |   ( Updated:2021-04-29 09:23:14.0  )
మంత్రుల ఏడాది వేతనం విరాళం
X

బెంగళూరు : కర్నాటకలో కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల దృష్యా రాష్ట్ర మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఏడాది వేతనాలను కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. కరోనాను కట్టడి చేయడానికి గాను చేపట్టే చర్యలకు ఈ ఫండ్‌ను వినియోగించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్పతో భేటీ అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక ఈ విషయాన్ని తెలియజేశారు.

రాష్ట్రంలో కరోనా మరణాలకు శ్మశానాల్లో జాగా దొరకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 230 ఎకరాల ప్రభుత్వ భూమిని దహనసంస్కారాల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లను ఆదేశించింది. ఇటీవలే ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని హోంమంత్రి బసవరాజ్ పోలీసులను ఆదేశించారు. ఇందులో భాగంగా 8,500 హోంగార్డుల సేవలను వినియోగించుకోవాలని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed