- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ పేరేంటి?
దిశ, స్పోర్ట్స్ : ఏవైనా రెండు టెస్టు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడుతుంటే దానికి ఒక పేరు, చరిత్ర ఉంటాయి. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆడితే యాషెస్ సిరీస్ అని, ఇండియా – ఆస్ట్రేలియా ఆడితే బోర్డర్ గవాస్కర్ సిరీస్ అని పిలుస్తుంటారు. ఆయా పేర్లకు కొంత చరిత్ర ఉంటుంది. మరి నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ పేరేంటని ఎవరికీ అనుమానం రాలేదా? బీసీసీఐతో ఉన్న ఒప్పందం మేరకు దానికి పేటీఎం టెస్టు సిరీస్ అని పిలుస్తారు. కానీ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ఒక పేరు ఉంది. దాని పేరు ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ. కరాచీలో పుట్టిన ఆంథోని ఫస్ట్ క్లాస్ క్రికెటర్. బ్రిటిష్ ప్రెసిడెన్సీ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బీసీసీఐ వ్యవస్థాపకుల్లో ఆంథోనీ ఒకరు.
దీంతో ఆయన పేరుమీదే 1951-52 సీజన్‌లో తొలి సారిగా ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య ఆంథోని డి మెల్లో ట్రోఫీని నిర్వహించారు. అయితే 2007లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను పటౌడి సిరీస్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలై 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆ సిరీస్‌కు పటౌడి ట్రోఫీ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు ఇండియా వెళ్తే పటౌడి ట్రోఫీ అని, ఇండియా పర్యటనకు ఇంగ్లాండ్ వస్తే ఆంథోని డి మెల్లో ట్రోఫీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆంథోని డి మెల్లొ ట్రోఫీ ఇండియా పక్షాన ఉన్నది. సిరీస్ డ్రా అయినా గెలిచినా అది టీమ్ ఇండియాతోనే ఉంటుంది.