- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ దెబ్బతో కేసీఆర్‌కు మతిభ్రమించింది : డీకే అరుణ ఆగ్రహం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల దెబ్బకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని BJP జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎన్నో హామీలు, ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అమలు చేయడం చేతకాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని నవంబర్ 4వ తేదీ నుండి అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోకుండా వరి పైరుకు, వరి పంటకు సంబంధించి కొత్త రాగం ఎత్తుకున్నారని చెప్పారు.
రైతులు పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని ప్రకటించి ఇప్పుడు నిందను మాత్రం కేంద్ర ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టుల పేర్లతో కోటానుకోట్ల రూపాయల అవినీతికి పాల్పడి రైతన్నను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. గద్వాలకి రండి ఇక్కడ జరుగుతున్న అవినీతి బాగోతం చూపిస్తామని అరుణ సవాల్ విసిరారు. పబ్లిసిటీ కోసం రెచ్చగొట్టే మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా..? ఇదేనా మీ సంస్కారం అని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.