ఉప సర్పంచ్‌పై వార్డు మెంబర్ల అవిశ్వాసం

by Shyam |   ( Updated:2021-08-12 06:01:38.0  )
ఉప సర్పంచ్‌పై వార్డు మెంబర్ల అవిశ్వాసం
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉపసర్పంచ్ పూర్ణ చందర్ రావుపై గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు ఏకమై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎంపీవో, జిల్లా కలెక్టర్‌కు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ.. చిట్యాల గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా విధులు నిర్వహించిన మాసు రాజయ్య మృతి చెందడంతో ఉపసర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్ రావు కు ఇంచార్జీ సర్పంచ్ గా బాధ్యతలను అప్పజెప్పారు.

అప్పటి నుంచి ఆయన బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని కావున వెంటనే ఇంచార్జీ సర్పంచ్, ఉపసర్పంచ్ బాధ్యతల నుంచి తొలగించి చిట్యాల గ్రామ పంచాయతీకి ఉప ఎన్నికను నిర్వహించాలని కోరారు. ఆయన ఇష్టానుసారంగా హరితహారం, పారిశుద్ధ్య పనులలో వార్డు మెంబర్ల ఆమోదం లేకుండానే పనులు చేస్తున్నాడన్నారు. కేవలం గ్రామపంచాయతీ అభివృద్ధి దృశ్య ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు జెట్టి కుమారస్వామి, పుల్ల రజిత, పులి రజిత, కందుల రమ, బుర్ర మౌనిక, ఆరేపల్లి మల్లయ్య, ఆకుల రవి, గుర్రపు కోమల, తొగరు జ్యోతి, సర్హోమ్ముల లక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

Next Story