- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన డీజిల్ ధర
by Anukaran |
X
దిశ, డైనమిక్ బ్యూరో : రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటడంతో వాహనాన్ని రోడ్డెక్కించాలంటే సామాన్యుడు భయపడాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారని అందరూ భావించినప్పటికీ.. రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.
అయితే, జీఎస్టీలోకి తీసుకొస్తే దాదాపు 35 రూపాయల వరకూ పెట్రో ధరలు తగ్గే అవకాశం ఉండేది. అయితే, తాజాగా డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొన్ని రోజులుగా పెట్రో ధరలు నిలకడగా ఉండగా.. ఒక్కసారిగా.. లీటర్ డీజిల్ ధరపై ఆదివారం 26 పైసలు, సోమవారం 27 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.97.46 కు చేరింది.
Advertisement
Next Story