- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏపీలో జగనన్న రౌడీ మామూళ్లు’.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు దిక్కుమాలిన నిర్ణయాలంటూ ధ్వజమెత్తారు. జగన్ నిర్ణయాలు అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలో గురువారం తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5% స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ విడుదల చేసిన జీవో నెంబర్ 145పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధన ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్‌కు ఆ దిక్కుమాలిన సలహాలు ఇచ్చేది ఎవరో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. ప్రైవేట్ లే అవుట్లలో జగన్‌కు ఐదు శాతం స్థలాన్ని ఎందుకు ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఖచ్చింతంగా లేఅవుట్ డవలపర్స్‌కు పెను భారంగా మారనుందని చెప్పుకొచ్చారు.
గజం రూ.10వేలు ఉన్న చోట ఎకరం స్ధలానికి 24 లక్షల రూపాయల భారం పడుతోందని.. భూములు కొనుగోలు చేసే వారిపై 10 శాతం అదనపు భారం పడుతుందని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. ప్రతి లేఅవుట్ లో ఓపెన్ బార్, వైన్ షాపులు పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడే పరిస్ధితి లేదని, మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకునే దుస్థితి నెలకొందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రౌడీ మామూళ్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి జగన్ రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారా అంటూ విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ పథకానికి జగనన్న రౌడీ మామూళ్లు అని పేరు పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పించి మరే అభివృద్ధి పనులను చేయలేకపోతున్నారని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు శాశ్వత లబ్ధి చేకూరే మంచి పనులు ఒక్కటైనా చేశారా అని విష్ణు కుమార్ రాజు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.