ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణపతి.. మనదేశంలో మాత్రం కాదు.. ఎక్కడ ఉందో తెలుసా..

by Sumithra |
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణపతి.. మనదేశంలో మాత్రం కాదు.. ఎక్కడ ఉందో తెలుసా..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : భారత దేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే ఒకరిని మించి మరొకరు గణనాథుల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటిలో ఎత్తైన విగ్రహం అంటే ఖైరతాబాద్ గణనాథుడు అని చెబుతుంటారు. ఈ గణనాథుని హైట్ ని బీట్ చేసే మరో గణనాథుని గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. అవునా అనుకుంటున్నారా. కానీ ఇది నిజం. ఖైరతాబాద్ గణపతి కన్నా ఎత్తుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేషునిగా థాయ్‌లాండ్‌లోని గణపయ్య విగ్రహం రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ కూడా బీట్ చేయలేకపోయారట. మరి ఈ విగ్రహం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని థాయ్‌లాండ్‌లోని ఖ్లాంగ్ ఖ్వాన్ నగరంలోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. 128 అడుగుల ఎత్తున్న గణేశుడు ఎత్తుకు మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన రూపానికి కూడా పేరుగాంచాడు. 39 మీటర్ల ఎత్తైన గణపతి విగ్రహం కుడివైపు పై భాగంలో ఓ పండుని ఏర్పాటు చేశారు. ఇది సమృద్ధి, శ్రేయస్సుకు చిహ్నం. ఎగువ ఎడమ చేతిలో చెరకు ఉంది. ఇది తీపి, ఆనందాన్ని సూచిస్తుంది. దిగువ కుడి చేతిలో అరటి పండు ఉంది ఇది పోషణకు ప్రతీక. దిగువ ఎడమ చేతిలో మామిడి పండుని పెట్టారు ఇది దైవిక జ్ఞానం, జ్ఞానంతో సంబంధం ఉన్న పండు.

ఈ భారీ విగ్రహాన్ని ఎప్పుడు, ఎలా తయారు చేశారు ?

థాయ్‌లాండ్ టూరిజం డైరెక్టరీ ప్రకారం గణపతి విగ్రహాన్ని పోలీసు జనరల్ సోమ్‌ చై వానిచ్సేని నేతృత్వంలోని చాచోంగ్‌సావో స్థానిక సంఘం సమూహంగా నిర్మించింది. ఈ గ్రూప్ చైర్మన్ 2009లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ గణపతి విగ్రహాన్ని 854 వేర్వేరు భాగాలను కలిపి తయారు చేశారు.

చచోయెంగ్‌సావోలోని క్లోంగ్ ఖువాన్ జిల్లాలో 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహంగా చెబుతున్నారు. థాయ్‌లాండ్‌లో ఇది స్థానికుల జీవనశైలి, ఆర్థిక వ్యవస్థతో సామరస్యపూర్వక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని నమ్ముతారు. ఇది దైవానుగ్రహానికి చిహ్నం అని కూడా చెబుతున్నారు.

బౌద్ధమతంలో హిందూ దేవళ్లకు ప్రత్యేక స్థానం..

బౌద్ధమతం ఆధిపత్య మతంగా ఉన్న థాయ్‌లాండ్‌లో అడ్డంకులను అధిగమించడానికి, వారి లక్ష్యాలను సాధించడానికి ప్రజలకు మార్గం చూపే దేవునిగా గణేశుడిని కొలుస్తారు. థాయ్‌లాండ్‌లో గణేశ ఆరాధన మూలాలు బ్రాహ్మణ మతం ఆగ్నేయాసియాలోకి ప్రవేశించిన కాలానికి చెందినవి. అది పెరిగేకొద్దీ గణేశుడు ఇక్కడ జ్ఞానాన్ని పెంచే దేవుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ భారీ గణపతి విగ్రహం కళకు అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు, దీన్ని ఓ పవిత్ర పుణ్యక్షేత్రంగా కూడా అభివృద్ధి చేశారు. ఈ విగ్రహం ఉన్న ఖ్లాంగ్ ఖువాన్ గణేశ అంతర్జాతీయ ఉద్యానవనం థాయ్‌లాండ్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు.

గణేశుడి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు..

ఈ అంతర్జాతీయ ఉద్యానవనం లోకల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ చాచోంగ్సావోగా పిలుస్తారు. ఇది సంస్కృతి, వారసత్వ కేంద్రంగా ఉంది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఆ భారీ గణనాథుని దర్శించుకుని ఆశీర్వాదాలు తసుకోవడమే కాదు, విగ్రహాన్ని చూసి ఎంతగానో ఆకర్షితులవుతారు. ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకు విదేశీయులు మాత్రమే కాదు భారతదేశం నుండి, అలాగే ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రజలు వస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed