- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 ముఖాల రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి.. ధరించే విధానం ఏంటో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : రుద్రాక్ష పవిత్రమైనది. హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది "ఎలియోకార్పస్ గానిట్రస్" ( Eleocarpus ganitrus ) చెట్టు నుంచి వచ్చే విత్తనం. శివునికి అంకితం చేసిన రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అచితే ఈ రుద్రాక్షలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటిలో పంచముఖి రుద్రాక్ష తరువాత, 8 ముఖాల రుద్రాక్షలు ( 8 Faced Rudraksha ) ప్రత్యేకమైనవని పండితులు చెబుతున్నారు. 8 ముఖాల రుద్రాక్షను వినాయకుని చిహ్నంగా భావిస్తారు. దీనిని ధరించడం ద్వారా వ్యక్తికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
అంతే కాదు ఈ రుద్రాక్షను ధరించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వ్యక్తి తన అన్ని పనులలో విజయాన్ని పొందుతాడని చెబుతున్నారు. దీన్ని ధరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే వ్యక్తి స్థిరత్వం, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని పొందుతారట. 8 ముఖాల రుద్రాక్ష వ్యాపారం, విద్య, వృత్తిపరమైన పురోగతికి కూడా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇది మనస్సును సమతుల్యంగా ఉంచుతుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు పండితులు. ఈ రుద్రాక్షను ధరించడం వలన గణేశుని (Ganesha) ఆశీర్వాదం లభించి జీవితంలో సానుకూలత లభిస్తుందని చెబుతున్నారు.
8 ముఖాల రుద్రాక్షలను ధరించే విధానం..
8 ముఖాల రుద్రాక్షలను ధరించే ముందు, దానిని శుద్ధి చేయడం అవసరం. ఇందుకోసం సోమవారం లేదా బుధవారం గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిలో కడిగి శుభ్రం చేయాలి. ఆ తరువాత గణేశుడి విగ్రహం లేదా చిత్రం ముందు రుద్రాక్ష ఉంచాలి. తరువాత ధూపం వేసి "ఓం గన్ గణపతయే నమః" అనే గణేశ మంత్రాన్ని (Ganesha Mantra) 108 సార్లు జపించాలి. ఎరుపు దారం లేదా బంగారు - వెండి గొలుసులో రుద్రాక్షను వేసి మెడ లేదా కుడి మణికట్టు చుట్టూ ధరించాలి. ఆ తర్వాత గణేశుడిని క్రమం తప్పకుండా పూజించాలి. అంతే కాదు రుద్రాక్షను స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచాలి. ఇది రుద్రాక్ష సానుకూల శక్తిని పెంచుతుంది.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.