పితృ పక్షం ముందు ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త !

by Sumithra |   ( Updated:2024-08-31 16:24:48.0  )
పితృ పక్షం ముందు ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త !
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : సనాతన ధర్మంలో పితృ పక్షానికి విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం పితృ పక్ష మాసం పూర్వీకులకు అంకితం చేసిన మాసం. పితృ పక్షాన్ని శ్రద్ధ అని కూడా అంటారు. శ్రాద్ధ పక్షం పూర్వీకులను పూజించడానికి, తర్పణం చేయడానికి చాలా మంచిదని భావిస్తారు. పితృ పక్షం సమయంలో మన పూర్వీకులు పితృ ప్రపంచం నుండి భూమికి వస్తారనే మత విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజుల్లో శ్రాద్ధం, తర్పణం, పిండదానం మొదలైనవాటిని ఆచరించే సంప్రదాయం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17 మంగళవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 2 న ముగుస్తుంది.

పండితుల తెలిపిన వివరాల ప్రకారం పితృ పక్షం భాద్రపద పూర్ణిమ నుండి ప్రారంభమై అశ్విన్ మాసం అమావాస్య తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈసారి పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 02 వరకు కొనసాగుతుంది. అందుకే ప్రజలు తమ పూర్వీకులకు ఆశ్వియుజం కృష్ణ పక్షంలో తర్పణం, శ్రాద్ధ కర్మలు మొదలైనవాటిని నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే పితృపక్షంలో ముందు కొన్ని సంకేతాల ద్వారా ఇంట్లో పితృ దోషం ఉందని తెలుసుకోవచ్చంటున్నారు పండితులు. అవి ఏంటంటే.

పెప్పల్ మొక్క ఇంట్లో అకస్మాత్తుగా పెరుగుతుంది.

కుక్క అరుస్తూ ఇంటి చుట్టూ తిరుగుతుంది.

తులసి మొక్క ఆకస్మికంగా ఎండిపోవడం.

ఇంట్లో వివాహాది కార్యక్రామాల్లో అంతరాయం.

గ్రహ బాధలు మొదలవ్వడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.

పితృ దోషం నుండి బయటపడే మార్గాలు..

ఈ సంకేతాలు ఎవరి ఇంట్లో కనిపించడం ప్రారంభిస్తాయో వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. దీనితో పాటు పితృ దోషం తొలగిపోవాలంటే పూర్వీకుల పూజలు, పురోహితుని సమక్షంతో శ్రాద్ధం చేయించాలట. అంతే కాదు మీ పూర్వీకులు కోపంగా ఉన్నట్లయితే వారు మోక్షాన్ని పొందేందుకు పితృ పక్షంలో శ్రాద్ధాన్ని ఆచరించాలంటున్నారు పండితులు.

Advertisement

Next Story