- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే హర్తాళికా తీజ్.. సాయంత్రం వరకు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందట..
దిశ, వెబ్‌డెస్క్ : మంచి అదృష్టాన్ని పొందాలనుకునే వారు ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని మూడవ రోజున హర్తాళికా తీజ్ ఉపవాసాన్ని పాటిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ ఉపవాసం సెప్టెంబర్ 6న ఆచరించనున్నారు. శివపార్వతులను పూజిస్తూ ఈ హర్తాళికా తీజ్ ( Hartalika Teej ) ఉపవాసాన్ని చేస్తుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం శివపార్వతులను ప్రార్థిస్తారు. అంతే కాదు హర్తాళికా తీజ్ ఉపవాసం ద్వారా కుటుంబంలో సిరిసంపదలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇంతకీ ఈ ఉపవాస దీక్ష ఎలా చేయాలి, నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండితుల ప్రకారం హర్తాళిక తీజ్ నాడు శివ - పార్వతులను పూజించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారని చెప్పారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, హర్తాళిక తీజ్ సాయంత్రం లక్ష్మీదేవి ముందు 11 దేశీ నెయ్యి దీపాలను వెలిగించాలంటున్నారు పండితులు. ఆ తర్వాత లక్ష్మీ చాలీసా పఠించి దీపాలను ప్రధాన ద్వారం చుట్టూ పెట్టాలట.
దీంతో పాటు లక్ష్మీ దేవి ( Goddess Lakshmi ) అనుగ్రహం పొందడానికి కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా హారతిని ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషించి ఆశీస్సులను అందజేస్తుందంటారు. కర్పూరం సువాసన కూడా ఇంట్లో సానుకూల వాతవరణాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని కాల్చాలి.
విష్ణువు లేకుండా లక్ష్మీ దేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. అందుకే హర్తాళిక తీజ్ నాడు శ్రీమహావిష్ణువును స్తుతించాలి, శ్రీమహావిష్ణువులక్ష్మిదేవిని ఉదయం కుంకుమపువ్వుతో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు.
హర్తాళిక తీజ్ నాడు శంఖం, కౌరీ, మఖానా, ముత్యాలు వంటి తెలుపు రంగు వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుందని అంటారు.
హర్తాళికా తీజ్ నాడు ఆవు, కుక్క, మేక, కాకి, పక్షులు మొదలైన జంతువులు, పక్షులకు ఆహారం తినిపించడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పటికీ ఉండదంటున్నారు పండితులు.