గణేష్ చతుర్థి.. ఈ రోజున పొరపాటున చంద్రుడిని చూడకండి.. కారణం ఇదే..

by Sumithra |
గణేష్ చతుర్థి.. ఈ రోజున పొరపాటున చంద్రుడిని చూడకండి.. కారణం ఇదే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. దీనిని కళంక్ చతుర్థి అని కూడా అంటారు. గణేష్ చతుర్థి వేడుకలను 10 రోజుల పాటు జరిపిస్తారు. గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదని పండితులు చెబుతుంటారు. ఇంతకీ గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు ?

గణేష్ చతుర్థి రోజున పొరపాటున కూడా చంద్రుడిని దర్శించకూడదు. అలా చేయడం చాలా అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఈ చంద్రుడిని ఎవరైనా చూస్తే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు పండితులు. ఈ రోజున చంద్రుడిని చూస్తే కొంత కళంకం, తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు.

గణేశుడు చంద్రుడిని ఎందుకు శపించాడు?

పురాణాల ప్రకారం ఒకప్పుడు గణేశుడు చేతిలో లడ్డూలను పట్టుకుని ఎలుక పై స్వారీ చేస్తుంటాడు. ఈ సమయంలో గణపయ్య బరువు పెరగడంతో ఎలుక తడబడి పడిపోతుంది. అప్పుడు చంద్రుడు అతన్ని చూసి నవ్వడం మొదలు పెట్టాడట. ఇదంతా చూసిన గణేషుణికి చాలా కోపం వచ్చిందట. అప్పుడు కోపంతో గణపయ్య చంద్రుడిని శపించాడు. నీ రూపాన్ని చూసి నువ్వు చాలా గర్వపడుతున్నావు, రోజు రోజుకు నీ కాంతి తగ్గిపోవుగాక, నిన్ను చూసిన వారికి నీలాప నిందలే పడుగాక అని శపించాడట. గణేశుడి శాపానికి గురై చంద్రుని ప్రకాశం రోజురోజుకూ తగ్గుతూ మృత్యువు వైపు పయనించడం ప్రారంభిస్తాడట.

చంద్రుని ప్రాణాలను కాపాడిన శివుడు..

ఆ తర్వాత దేవతలందరూ శివుని కోసం తపస్సు చేయమని చంద్ర దేవుడిని చెబుతారు. దీంతో చంద్రుడు గుజరాత్ లో సముద్రతీరంలో శివలింగాన్ని నిర్మించి తపస్సు చేశాడట. చంద్రుని తపస్సుకు సంతోషించిన పరమశివుడు అతని తల పై స్థానం ఇచ్చి మృత్యువు నుండి కాపాడాడు. చంద్రదేవుడు ప్రార్థించిన ప్రదేశంలో శివుడు మొదటిసారిగా జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు. ఆ ప్రదేశాన్ని సోమనాథ్ అని పిలుస్తారు.

గణేశుడిని క్షమాపణ అడిగిన చంద్రుడు..

ఇంత జరిగిన తర్వాత చంద్రుడు గణేషుడిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు గణపతి నీకు ఇచ్చిన శాపాన్ని నేను అంతం చేయలేను. కానీ నువ్వు 15 రోజులు నీ ప్రకాశాన్ని తగ్గించుకుంటావు, 15 రోజుల తర్వాత మళ్లీ పూర్తి చంద్రబింబంగా మారతావు అని చెబుతాడు. ప్రజలు ప్రతిరోజూ నిన్ను దర్శనం చేసుకోగలుగుతారు, అయితే భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు నిన్ను దర్శించుకునే వారు అపకీర్తిని ఎదుర్కోవలసి వస్తుంది. అతని పై తప్పుడు ఆరోపణలు ఉండవచ్చు అని చెప్పాడట.

Advertisement

Next Story

Most Viewed