- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొబ్బరికాయ కుళ్లిపొవడం అశుభమా?
దిశ, ఫీచర్స్ : మన కోరిక నెరవేరడం కోసం ఆలయానికి వెల్లి మన బాధలు, కోరికలను ఆ భగవంతుడికి చెబుతుంటాం.ముఖ్యంగా ఆ దేవునికి కొబ్బరికాయ కొట్టి మరి మన కోరిక తెలుపుతాం. అయితే మనం ఏ ఆలయానికి వెళ్లినా, ఇంట్లో చిన్న పూజ జరిగినా కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా కామన్. ఒకొక్కరు 10 కి పైగా కూడా కొబ్బరికాయలు కొడుతుంటారు. అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మన పెద్దవారు చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. దానిని నీటిలో కడిగి, పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలని, అలాగే ఆగ్నేయ ముఖంగా కొబ్బరికాయ కొట్టాలంటారు.
అయితే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్నిసార్లు కొబ్బరి లేకపోవడం, కుళ్లిపోవడం లాంటిది జరుగుతుంది. దీంతో చాలా మంది అనుమాన పడుతుంటారు.భయపడుతుంటారు ఇలా జరగడం మంచిది కాదేమో, మాకేమైనా హాని జరుగుతుందా అని, కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది టెంకాయ కొట్టగానే అది కుళ్లిపోయి గనుక వస్తే దీంతో తమకు అశుభం జరుగుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. అపనమ్మకమే. ఒక వేళ టెంకాయ కుళ్లిపోయి గనక వస్తే మళ్లీ స్నానం చేసి వచ్చి మళ్లీ ఇంకో కొబ్బరికాయను కొట్టాలంటున్నారు పండితులు. కొబ్బరికాయ కుళ్లిపొవడం కూడా మంచిదేనంట. అలాగే కొబ్బరికాయలో పువ్వు గనుక వస్తే వారు కోరిన కోరిక నెరవేరుతుందంట. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంట కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు గనుక వస్తే వారికి త్వరగా సంతానం కలుగుతుందంట. ( ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు)